AP Coronavirus: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు… తాజాగా ఎన్ని కేసులంటే..

AP Covid-19 Cases: ఏపీలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. గడిచిన 24..

AP Coronavirus: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు... తాజాగా ఎన్ని కేసులంటే..
Ap Coronavirus
Follow us
Subhash Goud

| Edited By: Rajeev Rayala

Updated on: Apr 22, 2021 | 10:23 PM

AP Covid-19 Cases: ఏపీలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. గడిచిన 24 గంటల్లో 41,871 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, అందులో కొత్తగా 10,759 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇక తాజాగా కరోనాతో చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, కర్నూలులో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, అనంతపురం, వైఎస్సార్‌ కడప, విశాఖలో ఒక్కరు చొప్పున మొత్తం 31 మంది మృతి చెందినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 9,97,462 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 7,541 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 3,992 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, 66,944 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు 9,22,977 మంది రికవరీ అయ్యారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారీగా…

అనంతపురం – 789, చిత్తూరు – 1474, ఈస్ట్‌ గోదావరి – 992, గుంటూరు -1186, వైఎస్సార్‌ కడప – 279, కృష్ణా -679, కర్నూలు – 1367, నెల్లూరు – 816, ప్రకాశం – 345, శ్రీకాకుళం – 1336, విశాఖ – 844, విజయనగరం – 562, వెస్ట్‌ గోదావరి – 90 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు 1,58,35,169 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇలా రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏమాత్రం ఆగడం లేదు. వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతూ రికార్డు సృష్టిస్తుంది.

Covid 19

Covid 19

ఇవీ చదవండి: PM Modi West Bengal Tour : రేపటి తన పశ్చిమ బెంగాల్ పర్యటనను రద్దు చేసుకున్న ప్రధాని మోదీ

AP Corona : కరోనా రోగులకు పడకలు, ఆక్సిజన్, వైద్యుల నియామకంపై ఏపీ మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు