Adimulapu Suresh : ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షలు ఎప్పుడంటే….! విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరణ
Adimulapu Suresh : ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ , ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
Andhra Pradesh Tenth and Inter exams : ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ , ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. పరీక్షలపై టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. లోకేష్ వ్యాఖ్యలు విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని తగ్గించే విధంగా ఉన్నాయన్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వ చర్యలు లోకేష్‌కు కనిపించడం లేదా అని మంత్రి ప్రశ్నించారు. వకీల్‌సాబ్‌కు వకాల్తా పుర్చుకున్నప్పుడు లోకేష్‌కు కరోనా గుర్తుకు రాలేదా అని మంత్రి నిలదీశారు. ఇలా ఉండగా, ఏపీలో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్న వార్తల నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులకు కరోనా సోకి, ఆ తర్వాత వాళ్ల కుటుంబ సభ్యులు మహమ్మారి బారిన పడితే ముఖ్యమంత్రి జగన్ బాధ్యత తీసుకుంటారా? అని లోకేష్ ప్రశ్నించారు. అంతేకాదు, పరీక్షలు నిర్వహిస్తే 80 లక్షల మంది కరోనా బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈరోజు లోకేష్ విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలతో ఆన్ లైన్ లో భేటీ అయిన సందర్భంలో ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి మంత్రి ఆదిమూలపు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి: భలే విచిత్రం.. ఈ ప్రాంతంలో ఆయుధాలతో కాకుండా మద్యం సీసాలతో యుద్ధం.. ఎందుకంటే..?
Fact Check: కరోనా కల్లోలంలో వైరల్ అవుతున్న ఫోటో.. ఇది రెండేళ్ళ క్రితం జరిగిన సంఘటన..ప్రూఫ్ ఇదిగో..