భ‌లే విచిత్రం.. ఈ ప్రాంతంలో ఆయుధాలతో కాకుండా మద్యం సీసాలతో యుద్ధం.. ఎందుకంటే..?

రెండు దేశాల మధ్య వివాదం  కొత్త విషయం కాదు. కొన్నిసార్లు ఈ వివాదాలు సరిహద్దు గురించి, నీటి గురించి, కొన్నిసార్లు వ్యాపారం, కొన్నిసార్లు అడ‌వుల గురించి కూడా ఉంటుంది.

భ‌లే విచిత్రం..  ఈ ప్రాంతంలో ఆయుధాలతో కాకుండా మద్యం సీసాలతో యుద్ధం.. ఎందుకంటే..?
The Whisky War
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 22, 2021 | 5:36 PM

రెండు దేశాల మధ్య వివాదం  కొత్త విషయం కాదు. కొన్నిసార్లు ఈ వివాదాలు సరిహద్దు గురించి, నీటి గురించి, కొన్నిసార్లు వ్యాపారం, కొన్నిసార్లు అడ‌వుల గురించి కూడా ఉంటుంది. మానవులు ఒకరి భూమిని ఆక్రమించుకోవడానికి శతాబ్దాలుగా పోరాడుతున్నారు. కాగా ఒక‌ ఐస్‌లాండ్ గురించి కూడా దశాబ్ధాల త‌ర‌బ‌డి వివాదం న‌డుస్తుంది. దాన్ని ద‌క్కించుకునేందుకు గత 30 సంవత్సరాలుగా రెండు దేశాలు రక్తం కాకుండా మద్యం దార‌బోస్తున్నాయి. అవును, ఆర్కిటిక్ యొక్క ఉత్తరాన ఎడారిగా ఉన్న ‘స్వాన్ ఐలాండ్’ ఆక్రమణ కోసం యుద్ధం ఈ త‌రహాలో జరుగుతోంది.

హాఫ్ స్క్వేర్ మైలులో విస్తరించి ఉన్న హన్స్ ద్వీపం కెనడా, డెన్మార్క్‌లను వేరుచేసే 22-మైళ్ల వెడల్పు గల నరేస్ జలసంధి మధ్యలో మూడు ద్వీపాలలో భాగంగా ఉంది. అంతర్జాతీయ చట్టం ప్రకారం, రెండు దేశాలకు తమ తీరానికి 12 కిలోమీటర్ల వరకు విస్తీర్ణంపై హక్కులు ఉన్నాయి. ఈ ద్వీపం డెన్మార్క్, కెనడా రెండింటి సముద్ర ప్రాంతాల ప‌రిధిలోకి వస్తుంది. ఈ కారణంగా రెండు దేశాల మధ్య వివాదాలు ఉన్నాయి. 1933 లో, లీగ్ ఆఫ్ నేషన్స్ ఈ విషయంలో డెన్మార్క్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ లీగ్ ఆఫ్ నేషన్స్ ముగిసిన తరువాత, ఆ నిర్ణయానికి కూడా అంత ప్రాముఖ్య‌త ల‌భించ‌లేదు.

తన దేశం యొక్క జెండాతో వైన్ బాటిల్ వదిలి…..

1984 లో డానిష్ మంత్రి హన్స్ ద్వీపాన్ని సందర్శించినప్పుడు ఈ వైన్ యుద్దం మొద‌లయ్యింది. అతను అక్కడికి వెళ్లి ఒక డానిష్ జెండాను ఎగ‌రేసి, ‘వెల్‌కమ్ టు డానిష్ ఐస్లాండ్’ అని రాసి… ఒక బాటిల్ వైన్ వదిలిపెట్టాడు. దీని తరువాత, డానిష్ సైనికులు కూడా హన్స్ ద్వీపానికి చేరుకుని తమ దేశం జెండాను అక్క‌డ ఎగ‌రేసి ‘వెల్‌కమ్ టు కెనడా’ అని రాశారు. దీనితో పాటు, వారు కూడా మద్యం బాటిల్ వదిలివెళ్లారు.

అప్పటి నుండి, రెండు దేశాల మధ్య విస్కీ యుద్ధం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ఇరు దేశాల సైనికులు ఇక్కడకు వచ్చి ఇదే తంతు కొన‌సాగిస్తున్నారు. డానిష్ సైనికులు వచ్చినప్పుడు, వారు తమ దేశంలో త‌యారైన‌ వైన్ బాటిల్ అక్క‌డ‌ వదిలివెళ్తారు. కెనడియన్ సైనికులు వచ్చినప్పుడు అదే విధంగా, వారు తమ దేశానికి చెందిన మద్యం బాటిల్‌ను వదిలివెళ్తారు. ఈ విధంగా, ఈ ప్రాంతంలో ఆయుధాలతో కాకుండా మద్యం సీసాలతో యుద్దం జ‌రుగుతుంది.

రూల్స్ బ్రేక్ చేస్తున్న నయనతార.! ప్రభాస్ సినిమాలో స్పెషల్ సాంగ్..
రూల్స్ బ్రేక్ చేస్తున్న నయనతార.! ప్రభాస్ సినిమాలో స్పెషల్ సాంగ్..
భారత్‌లో రికార్డ్‌ సృష్టిస్తున్న యాపిల్‌ కంపెనీ..
భారత్‌లో రికార్డ్‌ సృష్టిస్తున్న యాపిల్‌ కంపెనీ..
బాలయ్యతో వన్స్‌మోర్.. ఆహా అన్‌స్టాపబుల్‌లో శ్రీలీల..
బాలయ్యతో వన్స్‌మోర్.. ఆహా అన్‌స్టాపబుల్‌లో శ్రీలీల..
సినీ నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు.. వివాహితతో అక్రమ సంబంధం?
సినీ నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు.. వివాహితతో అక్రమ సంబంధం?
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పింక్ బాల్ టెస్ట్‌కి రంగం సిద్ధం
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పింక్ బాల్ టెస్ట్‌కి రంగం సిద్ధం
కరివేపాకుతో బరువు తగ్గడమే కాదు.. బోలెడు లాభాలు.. అవేంటో తెలుసా?
కరివేపాకుతో బరువు తగ్గడమే కాదు.. బోలెడు లాభాలు.. అవేంటో తెలుసా?
టెక్సాస్‌లో మరో హిందూ ఆలయం హరిహర క్షేత్రం.. తాత్కలికంగా బాలాలయం..
టెక్సాస్‌లో మరో హిందూ ఆలయం హరిహర క్షేత్రం.. తాత్కలికంగా బాలాలయం..
వామ్మో.! తుఫాన్ గండం.. ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు..
వామ్మో.! తుఫాన్ గండం.. ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు..
వేలానికి ముందు జీరో.. అమ్ముడైన వెంటనే సెంచరీ హీరో
వేలానికి ముందు జీరో.. అమ్ముడైన వెంటనే సెంచరీ హీరో
’నా ఉద్దేశం ప్రకారం ఆయనే ముఖ్యమంత్రి‘ : సంజయ్ రౌత్
’నా ఉద్దేశం ప్రకారం ఆయనే ముఖ్యమంత్రి‘ : సంజయ్ రౌత్
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్