AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: కరోనా కల్లోలంలో వైరల్ అవుతున్న ఫోటో.. ఇది రెండేళ్ళ క్రితం జరిగిన సంఘటన..ప్రూఫ్ ఇదిగో..

సోషల్ మీడియాతో ఉన్న ప్రమాదమే ఇది. ఒక్కోసారి పాత విషయాలు కూడా కొత్త విశేషాలుగా ట్రెండింగ్ లోకి వచ్చేస్తాయి. అందులోనూ రాజకీయ విమర్శలు ఎక్కువగా ఇలా పరుగులు తీస్తుంటాయి.

Fact Check: కరోనా కల్లోలంలో వైరల్ అవుతున్న ఫోటో.. ఇది రెండేళ్ళ క్రితం జరిగిన సంఘటన..ప్రూఫ్ ఇదిగో..
Fact Check
KVD Varma
|

Updated on: Apr 22, 2021 | 5:37 PM

Share

Fact Check: సోషల్ మీడియాతో ఉన్న ప్రమాదమే ఇది. ఒక్కోసారి పాత విషయాలు కూడా కొత్త విశేషాలుగా ట్రెండింగ్ లోకి వచ్చేస్తాయి. అందులోనూ రాజకీయ విమర్శలు ఎక్కువగా ఇలా పరుగులు తీస్తుంటాయి. ప్రస్తుతం కరోనా కల్లోలంలో దేశం అంతా చిక్కుకుంది. కరోనాకు సంబంధించినంత వరకూ ముఖ్యమైన ఆక్సిజన్ కొరత దేశవ్యాప్తంగా ఉంది. ఆక్సిజన్ కొరతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్దమే నడుస్తోంది. ఆక్సిజన్ సరఫరాలో లోపం మీదే అని కేంద్రంపై కొన్ని రాష్ట్రాలు విరుచుకు పడుతున్నాయి. ఈ తరుణంలో ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో ఒక బామ్మ ఆక్సిజన్ సిలిండర్ పక్కన పెట్టుకుని.. ఆక్సిజన్ తీసుకుంటూ రోడ్డు మీద ఉంది. కరోనా పీడిస్తున్న నేపధ్యంలో ఆక్సిజన్ కొరత..ఆసుపత్రుల్లో పడకల కొరత అధికంగా ఉందని.. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలే అని నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు.

ఈ ఫోటోను మొదట వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఫేస్ బుక్ పేజీ ‘దీదీ కె బోలో’ లో షేర్ చేశారు. దీనిని అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందు ఆ పేజీలో షేర్ చేసి ‘#ResignModi’ హ్యాష్ టాగ్ ఇచ్చారు. అంతేకాదు.. ”ఇదేనా ఆత్మనిర్భర భారత్”. అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ ఫోటో ఇప్పటివరకూ 2,500 సార్లు లైక్ అయింది సోషల్ మీడియాలో. వెయ్యిమందికి పైగా షేర్ చేశారు దీనిని.

ఇదీ అసలు విషయం..

అయితే, ఈ నిజం ఏమిటంటే.. ఈ ఫోటో ఇప్పటిది కాదంట. ఎప్పుడో 2018 లో ఏప్రిల్ 7 వ తేదీన తీసిన ఫోటో అంట. ఏఎన్ఐ న్యూస్ ఎజెన్సీ దీనిని యూట్యూబ్ లో ఆరోజు ఉంచింది. ఈ వీడియోలోని ఫోటో ఇప్పుడు తాజాగా వైరల్ గా మారింది.

నిజానికి ఈ వీడియోలో ఏముందంటే.. ఒక వ్యక్తి తన తల్లితో ఉత్తరప్రదేశ్ ఆగ్రా మెడికల్ కాలేజీ వద్ద అంబులెన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో ఆ తల్లికి ఆక్సిజన్ మాస్క్ ఉంది. ఆమె పక్కన ఆక్సిజన్ సిలెండర్ ఉంది. అంబులెన్స్ లోకి ఎక్కించడం కోసం వారు అలా రోడ్డు మీద ఉన్నారు. అంబులెన్స్ రావడం లేటు కావడంతో ఆమె అక్కడ రోడ్డుపై కూచుంది. దీంతో అప్పుడు ఫోటోలు తీసి సోషల్ మీడియాలోనూ షేర్ చేశారు కొందరు. అంటే ఈ వీడియో.. ఫోటోలు సరిగ్గా రెండేళ్ళ క్రితం తీసినవి.

అదండీ సంగతి విషయం తెలీకుండా.. కనీసం తెలుసుకోకుండా ఎక్కడో ఏదో కనబడింది కదా అని దానిని సోషల్ మీడియాలో పెట్టేసి.. దానికీ రాజకీయానికి ముడేసి.. మనకు నచ్చని రాజకీయ నాయకుని పేరు దానికి లింక్ చేసి షేర్ చేస్తే.. ఇలానే అవుతుంది.

ఇప్పుడు నెట్టింట్లో హడావుడి చేస్తున్న పోస్టులు ఇవీ..

అప్పుడు తీసిన అసలు వీడియో ఇదీ..

ఈ రెండూ చూస్తె మీకు అర్ధం అవుతుంది కదా ఇప్పుడు ఆక్సిజన్.. పడకలు లేక ఆ మహిళ రోడ్డు మీద పడింది అనే వార్త ఫేక్ అని!

Also Read: భ‌లే విచిత్రం.. ఈ ప్రాంతంలో ఆయుధాలతో కాకుండా మద్యం సీసాలతో యుద్ధం.. ఎందుకంటే..?

Vishnu Vishal, Jwala Gutta : డేటింగ్‌‌కు గుడ్‌బై.. వేదమంత్రాల మధ్య ఒక్కటైన జ్వాల గుత్తా, విష్ణు విశాల్‌