AP Corona : కరోనా రోగులకు పడకలు, ఆక్సిజన్, వైద్యుల నియామకంపై ఏపీ మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు
AP Corona : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోన్న వేళ రోగులకు పడకలు, ఆక్సిజన్, వైద్య నిపుణుల నియామకం, ఇతర సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడంపై మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు చేస్తోంది.
AP Cabinet subcommittee : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోన్న వేళ రోగులకు పడకలు, ఆక్సిజన్, వైద్య నిపుణుల నియామకం, ఇతర సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడంపై మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు చేస్తోంది. కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు విధించే అంశంపై కూడా ఉపసంఘం చర్చించింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ నేపథ్యంలో వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళగిరి ఏపీఐఐసీ ఆఫీసులో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో మంత్రి వర్గ ఉప సంఘం కొంచెం సేపటి క్రితం సమావేశమైంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు చర్చిస్తున్నారు. ఇలా ఉండగా, ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రతి రోజు 5 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది జగన్ సర్కార్. ఐదుగురు మంత్రులతో మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కన్వీనర్ గా ఉప సంఘం ఏర్పాటు చేసింది. హోంమంత్రి మేకతోటి సుచరిత, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మెంబర్లుగా ఈ ఉప సంఘం ఏర్పాటైన సంగతి తెలిసిందే.
మరిన్ని ఇక్కడ చూడండి: Covid-19: పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. కేంద్రంపై ‘సుప్రీం’ ఆగ్రహం..
వింత చెట్లు… వాటిని నరికితే బెరడ్ల నుంచి రక్తం వస్తుంది. దానితో ఏం చేస్తారంటే..?