వింత చెట్లు… వాటిని నరికితే బెరడ్ల నుంచి రక్తం వస్తుంది. దానితో ఏం చేస్తారంటే..?
ప్రకృతి ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. మనుషులకు తెలియని చాలా రహస్యాలు ఇంకా ఈ విశ్వంలో ఉన్నాయి. ప్రకృతి రహస్యాలను...
ప్రకృతి ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. మనుషులకు తెలియని చాలా రహస్యాలు ఇంకా ఈ విశ్వంలో ఉన్నాయి. ప్రకృతి రహస్యాలను ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఎప్పటికప్పుడు, అనేక కొత్త ఆశ్చర్యకర విషయాలు తెరపైకి వస్తుంటాయి. వాటి గురించి తెలుసుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అది మనుషులు, జంతువులు, పక్షులు ఇలా వేటి గురించి అయినా అవ్వొచ్చు. ఈ రోజు మీ ముందుకు ఇలాంటి ఓ విచిత్రమైన విషయాన్ని తీసుకురాబోతున్నాం.
‘డ్రాగన్ బ్లడ్ ట్రీ చెట్లు’ సాకోత్రా ద్వీపసమూహంలో కనిపిస్తాయి. ఈ చెట్లు 650 సంవత్సరాల వరకు జీవించగలవు. ఇవి 33 నుంచి 39 అడుగుల వరకు పెరుగుతాయి. ఇవి వేడి ఉష్ణోగ్రతలలో బాగా వృద్ధి చెందుతాయి. అవి గొడుగుల్లాంటి ఆకారంలో ఉంటాయి. చెట్టు పైభాగంలో ఆకులు, కొమ్మలు దట్టంగా ఉంటాయి. ఈ చెట్లు ఉండే ప్రాంతాన్ని ‘డ్రాగన్‌బ్లడ్’ ఫారెస్ట్ అంటారు. ఎరుపు రంగు రెసిన్లు దాని బెరడు నుంచి వెలువడటం వలన ఈ చెట్టును ‘డ్రాగన్ బ్లడ్ ట్రీ’ అని పిలుస్తారు. బెరడును కత్తిరించిన తరువాత, ఎర్ర రెసిన్లు దాని నుండి బయటకు వస్తాయి. ఆ సమయంలో ఆ ద్రావకం అచ్చం రక్తంలాగే కనిపిస్తుంది. ఇతర చెట్లను నరికిన తరువాత తెలుపు, పసుపు గమ్ బయటకు వచ్చినట్లే, అదే విధంగా ఈ చెట్టు నుండి ఎరుపు రంగు వస్తుంది.
ఈ రెసిన్ జ్వరం, పూతల నివారణగా స్థానికులు భావిస్తారు. ఈ లక్షణాలు ఉన్నప్పటికీ, నేడు ఈ చెట్లు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వాటి భవిష్యత్తు సంక్షోభంలో ఉంది. కొన్ని కొత్త చెట్లలో వాటి ఆకారం చాలా మారిపోయినట్లు కనిపిస్తుంది.
Also Read: విజయవాడ నగరంలో కరోనా రోగుల మృతదేహాలతో నిండిపోతున్న శ్మశానాలు, ఏపీ ప్రజల్లో భయాందోళనలు