Somu Veerraju: తెలుగు రాష్ట్రాల జల వివాదంపై ఇద్దరు ముఖ్యమంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సోము వీర్రాజు

Somu Veerraju Sensational Comments: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం విషయంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము..

Somu Veerraju: తెలుగు రాష్ట్రాల జల వివాదంపై ఇద్దరు ముఖ్యమంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సోము వీర్రాజు
Somu Veerraju
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Subhash Goud

Updated on: Jul 11, 2021 | 1:58 PM

Somu Veerraju Sensational Comments: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం విషయంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల వివాదం అంశంపై ఇద్దరు ముఖ్యమంత్రులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ నీటి ప్రాజెక్టులపై త్వరలో మా స్టాండ్‌ ప్రకటిస్తామని, రాయలసీమలో 11 వివాదస్పద ప్రాజెక్టులున్నాయని అన్నారు. జల వివాదం విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సీఎంలు కేసీఆర్, జగన్‌ పగలు పోరాటం చేస్తూ, రాత్రి దోస్తీ చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో రాజకీయాల్లో కుటుంబ పాలన చేపట్టి సమాజాన్ని కుటుంబాలకు అమ్మేసుకున్నారని విమర్శించారు. వారసత్వ రాజకీయాల వల్ల రూలింగ్‌ కాకుండా ట్రేడింగ్‌ జరుగుతోంది ఆరోపించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్‌ కుటుంబ పాలన వల్ల దేశం చాలా నష్టపోయిందని మండిపడ్డారు. ఒక చాయ్‌ అమ్మేవ్యక్తిని దేశ ప్రధానిని చేసిన ఘనత బీజేపీదేనని అన్నారు. ఏపీలో కూడా చంద్రబాబు, వైయస్‌ఆర్‌ కుటుంబ పాలనలు నడుస్తున్నాయని, ఏపీలో ఆ పరిస్థితిని మార్చేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించాలని, అందుకు అనుగుణంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి బీజేపీ పాలన రాష్ట్రంలో ఏర్పడేలా ప్రయత్నం చేయాలన్నారు. ఏపీలో ప్రధానంగా రూలింగ్‌ కాకుండా ట్రేడింగ్ జరుగుతోందని, చివరకు మద్యాన్ని కూడా ప్రభుత్వమే తయారు చేసి అమ్మే దుస్థితి నెలకొందని విమర్శించారు.  అలాగే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాదని తేల్చి చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరించకుండా కాపాడే బాధ్యతను ఏపీ బీజేపీ తీసుకుంటుందని అన్నారు.

ఇవీ కూడా చదవండి

Tamil Nadu: తమిళనాడు రాష్ట్రాన్ని విభజిస్తున్నారా? డీఎంకే ఎంపీ కనిమొళి సంచలన కామెంట్స్..!

VK Sasikala: అన్నాడీఎంకే నేతల మధ్య కుమ్ములాటలు.. పార్టీ పగ్గాలు శశికళకు అప్పగించాలని తీర్మానం

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ