AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Montha: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి ఎంత నష్టం జరిగిందో తెలుసా?

మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్రానికి ఏర్పడిన నష్టంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఏర్పడిన నష్టాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సమావేశం తర్వాత సీఎం మాట్లాడుతూ.. తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రానికి సుమారు రూ.5,265 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఆయన తెలిపారు.

Cyclone Montha: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి ఎంత నష్టం జరిగిందో తెలుసా?
CM Chandrababu Naidu on cyclone montha
Anand T
|

Updated on: Oct 30, 2025 | 6:57 PM

Share

ఆంధ్రప్రదేశ్‌పై మొంథా తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో.. రాష్ట్రంలో జరిగిన నష్టంపై గురువారం అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యప్తంగా వివిధ రంగాల్లో ఏర్పడిన నష్టాన్ని అధికారులు సీఎం చంద్రబాబు దృష్ఠికి తీసుకొచ్చారు. ఇక ఈ సమావేశం తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రానికి రూ.5,265 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు.వ్యవసాయ రంగానికి రూ.829 కోట్లు, ఆర్‌అండ్‌బీకి రూ.2,079 కోట్ల మేర నష్టం జరిగినట్టు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు తుఫాన్ కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని.. కానీ 120 వరకు పశువులు మృత్యువాత తెలిపారు.

అయితే తుఫాన్ బీభత్సాన్ని ముందుగానే అంచనా వేసి.. తగిన చర్యలు తీసుకోవడంతోనే.. చాలా వరకు నష్టాన్ని నివారించగలినట్టు ఆయన తెలిపారు. తుపాను కారణంగా మారుతున్న పరిణామాలను అంచనా వేసి.. వాటికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకున్నామని సీఎం తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించడానికి గతంలో 10 గంటల సమయం పట్టేది.. కానీ ప్రస్తుతం విద్యుత్‌ సరఫరా ఆగినా 3 గంటల్లోనే పునరుద్ధరించగలిగామని ఆయన తెలిపారు.

ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పని చేశారని.. ఎలా ప్రాణ నష్టం లేకుండా తుఫాన్‌ను ఎదుర్కొవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్నా.. కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించారని.. గతంలో చెట్లు కూలితే.. తొలగించేందుకు వారం పట్టేదని తెలిపారు. ప్రకృతి విపత్తులను ఎవరూ ఆపలేరని.. కానీ ముందస్తు చర్యల వల్ల జరిగే నష్టాన్ని తగ్గించవచ్చుని సీఎం చంద్రబాబు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.