AP 10th & Inter Hall Tickets: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల-2023 హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ ఇలా

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల-2023 హాల్‌టికెట్లు విడుదలైనట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఇంటర్‌ బోర్డు సెక్రెటరీ శేషగిరిబాబు మంగళవారం (మార్చి 14) ఓ ప్రకటనలో..

AP 10th & Inter Hall Tickets: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల-2023 హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ ఇలా
AP SSC Exams 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 14, 2023 | 9:43 PM

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల-2023 హాల్‌టికెట్లు విడుదలైనట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఇంటర్‌ బోర్డు సెక్రెటరీ శేషగిరిబాబు మంగళవారం (మార్చి 14) ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎస్సెస్సీ లేదా మొదటి ఏడాది హాల్‌టికెట్‌ నంబరుతో థియరీ పరీక్షల హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రెండో ఏడాది చదివే వారు మొదటి ఏడాది లేదా రెండో ఏడాది హాల్‌టికెట్‌ నంబరుతో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. హాల్‌టికెట్లలో ఫొటోలు, సంతకాలు, ఇతర వివరాల్లో తప్పులు దొర్లితే ఆయా కాలేజీల ప్రిన్సిపల్‌ దృష్టికి తీసుకువెళ్లి సరిచేయించుకోవాలని శేషగిరిబాబు ఈ సందర్భంగా సూచించారు. విద్యార్ధి జిల్లా, పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలతో వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ ఇలా..

2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు జిల్లా, పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలతో వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు కేటాయించిన కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.