Andhra Pradesh: ఆర్‌ఆర్ఆర్‌ టీమ్‌పై ఏపీ క్యాబినేట్‌ ప్రశంసలు.. తెలుగు సినిమా ఖ్యాతిని..

ఆస్కార్ అవార్డ్ అందుకున్న RRR సినిమా యూనిట్‌ను ఏపీ కేబినెట్ ప్రత్యేకంగా అభినందించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేశారంటూ సీఎం జగన్ ప్రశంసలు కురిపించారు.

Andhra Pradesh: ఆర్‌ఆర్ఆర్‌ టీమ్‌పై ఏపీ క్యాబినేట్‌ ప్రశంసలు.. తెలుగు సినిమా ఖ్యాతిని..
Cm Jagan
Follow us
Basha Shek

|

Updated on: Mar 14, 2023 | 8:43 PM

అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన 15 బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 45 ఎజెండా అంశాలపై చర్చించిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. SC, ST, BC మహిళా కమిషన్ కాలపరిమితిని మూడేళ్ల నుంచి రెండేళ్ళకు తగ్గించాలని నిర్ణయించారు. గ్లోబల్ ఇన్వెస్టమెంట్ సమ్మిట్‌ విజయవంతం కావడంపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. కాగా ఆస్కార్ అవార్డ్ అందుకున్న RRR సినిమా యూనిట్‌ను ఏపీ కేబినెట్ ప్రత్యేకంగా అభినందించింది. కాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం జరిగింది. 45 అజెండా అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించగా, అసెంబ్లీలో ప్రవేశపెట్టే 15 బిల్లులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కొత్త ఇండస్ట్రియల్‌ పాలసీకి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2023-27 పారిశ్రామిక విధానానికి సైతం కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ముందుగా, స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఏపీ బీఏసీ సమావేశం జరిగింది. 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎసీ నిర్ణయించింది. 9 రోజులపాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 16న బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు.

ఇక జులైలోనే మనం విశాఖ వెళ్తున్నాం.. ఇక ఆలోచించాల్సిన పనిలేదు.. ఇదే ఫైనల్.. అంటూ సీఎం జగన్ మంత్రివర్గ సమావేశంలో పేర్కొన్నారు. అలాగే 7స్థానాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను గెలవాలంటూ సూచించారు. ఏం తేడా వచ్చినా.. మంత్రివర్గంలో మార్పు తప్పదంటూ సీఎం జగన్ మంత్రులను హెచ్చరించారు. మీ పని తీరు గమనిస్తున్నా.. ఇకనైనా అలర్ట్ అవ్వండి అంటూ మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు. ఏడెంటికి ఏడు ఎమ్మెల్సీలు గెలవాల్సిందేనంటూ పేర్కొన్న జగన్.. పలు విషయాలపై మంత్రులకు క్లారిటీ కూడా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..