Jana Sena 10th Formation Day: ఎప్పటికైనా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: ఆవిర్భావ సభలో పవన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న జనసేన పార్టీ పదవ వార్షిక ఆవిర్భావ సభను కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఘనంగా నిర్వహిస్తోంది. ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా తరలి రానున్నారు. ఇప్పటికే రెట్టించిన ఉత్సాహంతో ప్రతి ఒక్కరు మచిలీపట్నం చేరుకుంటున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు చెక్కులను పంపిణీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సభలో ప్రసంగించారు.
పదేళ్ల కిందట నేను పార్టీ పెట్టినప్పుడు నా వెనుక ఎవరూ లేరని, సగటు మనిషికి మేలు చేయాలనే తపనతో పార్టీ పెట్టానని అన్నారు. ఆ సమయంలో నాకు రాజకీయాలు తెలియవు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. సగటు మనిషికి మేలు చేయాలన్నదే తపన అని అన్నారు. నాకు పింగళి వెంకయ్య స్ఫూర్తి అని, పేదలకు అండగా నిలువాలన్నదే నా ఉద్దేశమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మీ అభిమానం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఎంతో మంది పార్టీలు పెట్టి వదిలేశారు. రెండు చోట్ల ఓడిపోయినా ప్రజల కోసం నిలబడ్డానని పేర్కొన్నారు.
మహా అయితే ప్రాణాలు పోతాయి.. మహానుభావుల స్ఫూర్తి ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. పులివెందుల సహా అన్ని చోట్ల క్రియాశీల కార్యకర్తలున్నారు.. తెలంగాణలో 30 వేల మంది క్రియాశల కార్యకర్తలున్నారన్నారు. ఎప్పటికైనా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజలకు అండగా నిలబడాలంటే ధర్మాన్ని నిలబెట్టాలని, అదే జనసేన పార్టీని నిలబెడుతుందన్నారు. పార్టీ పెట్టే సమయంలో 7 సిద్ధాంతాలను ప్రతిపాదించామని, రాజకీయ అవినీతిపై తిరుగులేని పోరాటం చేస్తామని, ప్రజలకు మేలు చేసేందుకు పార్టీ పెట్టామని ఆయన అన్నారు. జనసేన పార్టీ 6.5 లక్షల క్రియాశీల కార్యకర్తలు ఉన్నారన్నారు. కులాలను కలపాలన్నదే నా అభిమతం.. కులాల గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. కమ్మ, కాపు, దళితులు అని మాట్లాడడానికి ఇబ్బంది పడేవాడినని, ప్రభుత్వం కులాలను విడదీసే ప్రయత్నం చేస్తోందని పవన్ విమర్శించారు. కాపు కులంలో పుట్టినా అందరికి అండగా నిలవాలన్నది నా ప్రయత్నమన్నారు. నేను కులాన్ని అమ్మేస్తానని అంటుంటే బాధేస్తుందని, ఉత్పత్తి కులాల నుంచి నిజమైన మేధావులు వస్తారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీ కుల కార్పొరేషన్‌లు ప్రారంభించిందని, గంగవరం పోర్ట్ నిర్వాసితులు 18 డిమాండ్లు పెట్టారు.. నేను ఎక్కడికి వెళ్లినా జనం మార్పు కోరుకుంటున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలు సంఖ్యాబలం ఉన్నా.. దేహీ అనే పరిస్థితి ఉందని.. ఇది వారి తప్పు కాదు, అనైక్యతే సమస్య అని అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి