Jana Sena 10th Formation Day Highlights: మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ.. అభిమానుల కేరింతలతో హోరెత్తుతున్న వేదిక

| Edited By: Subhash Goud

Updated on: Mar 14, 2023 | 10:36 PM

Janasena 10th Formation Day Live Updates: ఛలో మచిలీపట్నం.. జనసేన కార్యకర్తల దారులన్నీ అటువైపే.. వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ ఏం మాట్లాడతారు..? సైనికులకు ఎలాంటి సందేశమిస్తారన్న విషయం ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Jana Sena 10th Formation Day Highlights: మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ.. అభిమానుల కేరింతలతో హోరెత్తుతున్న వేదిక
Janasena

Janasena 10th Formation Day Updates: ఛలో మచిలీపట్నం.. జనసేన కార్యకర్తల దారులన్నీ అటువైపే.. వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ ఏం మాట్లాడతారు..? సైనికులకు ఎలాంటి సందేశమిస్తారన్న విషయం ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మంగళవారం సాయంత్రం మచిలీపట్నంలో జరిగే జనసేన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ 10వ ఆవిర్భావ సభను గ్రాండ్‌గా నిర్వహించేందుకు జనసేన శ్రేణులు సమాయత్తమయ్యాయి. అయితే కొన్ని గంటల ముందు పోలీసుల నోటీసులు జనసైనికులను ఆందోళనకు గురిచేశాయి. పోలీస్ యాక్ట్-30 కారణంగా ర్యాలీలకు పర్మిషన్ లేదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ర్యాలీలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అయితే, మచిలీపట్నంలో జరిగే జనసేన సభకు అనుమతి ఉంది.. ర్యాలీ లేకుండా సభ ఎలా అన్నది జనసేన సైనికుల వాదన.

మరో వైపు వారాహి వాహనంలో ఆటోనగర్‌ నుంచి కదలి రావాలని చూస్తున్నారు పవన్ కల్యాణ్. మచిలీపట్నం సభకు వారాహిలో పవన్ వస్తారని.. భారీ ర్యాలీ జరుగుతుందని జన సైనికులు భావించారు. అయితే పోలీసుల ప్రకటనలు ర్యాలీలకు అడ్డంకిగా మారాయి. గతంలో కూడా పవన్ కల్యాణ్ ర్యాలీలకు అనుమతివ్వకుండా పోలీసులు అడ్డుకున్న సందర్భాలున్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తితే.. పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది.

మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడలోని ఆటోనగర్ ప్రాంతం నుంచి పవన్ వారాహిలో బయల్దేరారు. సభా వేదికకు శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేశారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Mar 2023 09:28 PM (IST)

    కౌలురైతు కుటుంబాలకు చెక్కుల పంపిణీ..

    ఆవిర్భావ సభలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్షరూపాయల చెక్కులను పంపిణీ చేస్తున్నారు పవన్ కల్యాణ్.  మొత్తం 51 మంది కుటుంబాలకు ఈ చెక్కులు పంపిణీ చేయనున్నారని తెలుస్తోంది..

  • 14 Mar 2023 09:21 PM (IST)

    సభా స్థలికి చేరుకున్న పవన్

    ఎట్టకేలకు పవన్ కల్యాణ్ సభాస్థలికి చేరుకున్నారు.  మరికొద్ది సేపట్లో పార్టీ కార్యకర్తలు, శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడనున్నారు.

  • 14 Mar 2023 08:47 PM (IST)

    కారులో సభా స్థలికి పవన్..

    సమయం మించి పోతుండడంతో పామర్రు దగ్గర వారాహి వాహనం దిగి కారులో సభా స్థలికి వెళ్లిపోయారు పవన్ కల్యాణ్. దీంతో మరికొద్ది సేపట్లో ఆయన సభాస్థలికి చేరుకోనున్నారు.

  • 14 Mar 2023 07:51 PM (IST)

    కంకిపాడు టోల్ గేట్ దాటిన వారాహి

    దారిపొడుగునా ఉన్న జనసేన శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ.  సభాస్థలి కి ఇంకో 40 నిముషాలలో చేరుకోనున్నట్లు తెలుస్తుంది.

  • 14 Mar 2023 06:37 PM (IST)

    మానవత్వం చేటుకున్న పవన్.. అంబులెన్స్ కి దారిచ్చిన వారాహి

    ఇసుకేస్తే రాలనంత మంది జనసేన శ్రేణులు, ప్రజలు వెంట తరలిరాగా వారాహి యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. మార్గమధ్యంలో పెనమలూరు నియోజకవర్గం, ఈడ్పుగల్లు వద్ద అత్యవసర సర్వీసు అయిన అంబులెన్స్ వాహనాల మధ్య ఇరుక్కుపోయింది. దీంతో పవన్ కల్యాణ్ సుమారు 10 నిమిషాల పాటు తన వారాహిని నిలిపివేశారు.  అంబులెన్స్ ముందుకు వెళ్లిపోయిన తర్వాత వారాహి యాత్ర కొనసాగింది.

  • 14 Mar 2023 06:34 PM (IST)

    స్పీడ్ పెంచిన పవన్ వారాహి..

    పవన్ వారాహి రాకతో విజయవాడ - మచిలీ పట్నం హైవేపై ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయ్యింది. దీంతో వారాహి ముందు 2 పోలీస్ వాహనాలతో పవన్ ర్యాలీ నీ వేగంగా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం పవన్ ర్యాలీ ఈడుపుగల్లు చేరుకుంది. వేలాది కొద్ది బైకులతో పవన్ వాహనాన్ని అనుసరిస్తున్నారు అభిమానులు.

  • 14 Mar 2023 05:09 PM (IST)

    పెనమలూరు చేరుకున్న పవన్ వారాహి

    పవన్ వారాహి పెనమలూరు చేరుకుంది. అడుగడుగునా అభిమానుల తాకిడి తో  ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పవన్ ర్యాలీ నెమ్మదిగా వెళ్తోంది. ప్రస్తుతమున్న పరిస్థితులు చూస్తుంటే మచిలీపట్నం సభా స్థలికి చేరుకోవటానికి 7 గంటలయ్యే అవకాశముందని తెలుస్తోంది.

  • 14 Mar 2023 04:44 PM (IST)

    ముందుకు కదలని వారాహి.. 7 గంటలకు సభాస్థలికి పవన్

    జనసేన ఆవిర్భావ సభకోసం ఇప్పటికే కానురు చేరుకున్నరు  జనసేనని పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా వారహిక దారి పొడుగునా పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలుకుతున్నారు. ట్రాఫిక్ నీ క్లియర్ చేస్తూ వారాహిని ముందుకు పంపుతున్న పోలీసులు. ఇంకా 50 కిలోమీటర్లు మేర వెళ్లాల్సి ఉండటంతో సభా స్థలికి 7 గంటలకు చేరుకునే అవకాశం ఉందని  పార్టీ వర్గాలు, పోలీసులు చెబుతున్నాయి..

  • 14 Mar 2023 04:03 PM (IST)

    స్తంభించిన ట్రాఫిక్..

    పవన్ సభతో మచిలీ పట్నం టౌన్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. పవన్ వారాహీ ర్యాలీగా రావడంతో  ఆటోనగర్‌లో వాహనాలు నిలిచిపోయాయి.  తాడిగడప జంక్షన్, పోరంకి, పెనమలూరు, పామర్రు, గుడివాడ సెంటర్  తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. గూడూరు మీదుగా మచిలీపట్నానికి చేరుకుంటున్నారు పవన్.  సాయంత్రం 5 గంటలకు సభాప్రాంగణానికి  చేరుకుంటారు.

  • 14 Mar 2023 03:21 PM (IST)

    పవన్ సభకు భారీగా తరలిన జనసేన పార్టీ శ్రేణులు

    అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నుండి పవన్ కళ్యాణ్ సభకు  జనసేన నేతలు భారీగా వెళ్లారు. నియోజకవర్గ ఇంచార్జి శెట్టిబత్తుల రాజబాబు  ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా పవన్ సభకు ప్రారంభమయ్యారు.  బోడస్సకురు బ్రిజ్ పై భారీ ర్యాలీ గా  నియోజకవర్గ జనసేన నేతలు ,కార్యకర్తలు భారీగా వెళ్లారు. అలాగే వందలాది కార్లలోనూ జనసేన ఆవిర్భావ సభకు వెళ్లారు. మెగా అభిమానుల ప్రాంతం అమలాపురం నుండి భారీ ర్యాలీగా వెళ్తున్న డ్రోన్ వీడియోస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముమ్మిడివరం జనసేన కార్యాలయం నుండి ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో 10 బస్సులు 50 కార్లతో భారీ ర్యాలీగా మచిలీపట్నం జనసేన ఆవిర్భావ సభకు బయలు దేరాయి జనసేన శ్రేణులు.

  • 14 Mar 2023 03:05 PM (IST)

    మచిలీపట్నం బయలుదేరిన పవన్ కళ్యాణ్

    విజయవాడ నోవాటెల్ హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ మచిలీపట్నం బయలు దేరారు.

    బెంజ్ సర్కిల్ మీదుగా ఆటోనగర్ వారాహి వద్దకు పవన్, నాదెండ్ల మనోహర్ చేరుకోనున్నారు.

Published On - Mar 14,2023 3:02 PM

Follow us
Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు