Andhra Pradesh: పెళ్లైన వారానికే నూతన దంపతుల మధ్య గొడవలు.. మాట్లాడదామంటూ పిలిచి కత్తి పీటతో..
పెళ్లైన వారానికే నవ దంపతుల కుటుంబాల మధ్య వివాదం రాజుకుంది.. అది చంపుకునేంత వరకు వెళ్లింది. పచ్చని పారాణి ఆరకముందే నవ వధువు ఆమె తల్లిదండ్రులు దారుణ హత్యకు గురయ్యారు.
పెళ్లైన వారానికే నవ దంపతుల కుటుంబాల మధ్య వివాదం రాజుకుంది.. అది చంపుకునేంత వరకు వెళ్లింది. పచ్చని పారాణి ఆరకముందే నవ వధువు ఆమె తల్లిదండ్రులు దారుణ హత్యకు గురయ్యారు. వరుడి తండ్రి.. కోడలు, ఆమె తల్లిదండ్రులపై కత్తిపీటతో దాడి చేశాడు. ఈ ఘటనలో వధువు, ఆమె తల్లి మరణించగా.. తండ్రి తీవ్రగాయాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటన కర్నూలు నగరంలోని చెన్నమ్మ సర్కిల్ వద్దనున్న సుబ్బలక్ష్మి నగర్లో చోటుచేసుకుంది. కర్నూలు నగరంలోని చెన్నమ్మ సర్కిల్ వద్దనున్న చింతలముని నగర్ కు చెందిన ప్రసాద్ కుటుంబ సభ్యులు కిరాతకంగా కత్తితో.. తల్లి, కూతురును చంపారు. ప్రసాద్ కృష్ణవేణి దంపతుల కుమారుడు.. శ్రావణ్ కు ఈనెల మార్చి 1న తెలంగాణ వనపర్తికి చెందిన రుక్మిణి తో వివాహం అయ్యింది. ఈరోజు ఉదయం వనపర్తి నుంచి రుక్మిణి, ఆమె తల్లి రమాదేవి, తండ్రి వెంకటేష్ ముగ్గురు కర్నూలులోని భర్త శ్రావణ్ ఇంటికి వచ్చారు. వచ్చిన కొన్ని గంటల్లోపే గొడవ జరిగింది. దీంతో కత్తిపీటతో వరుడి తండ్రి హత్యలకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో రుక్మిణి, రమాదేవి మరణించగా.. రుక్మిణి తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణ్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. హత్యలకు కారణమైన ప్రసాద్, శ్రావణ్, కృష్ణవేణిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముగ్గురిని వరుడు శ్రావణ్ తండ్రి చంపినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. పెళ్లైన అనంతరం వధూవరుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో .. వనపర్తిలో ఉన్న భార్య, ఆమె తల్లిదండ్రులను ఇంటికి రప్పించి తండ్రి కొడుకులిద్దరూ ఘాతుకానికి పాల్పడినట్లు పేర్కొంటున్నారు. కుటుంబ కలహలే కారణమని పోలీసులు పేర్కొంటున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..