Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andra Pradesh: పోలీస్ స్టేషన్ నుంచి పార్టీ కార్యకర్తను తీసుకెళ్లిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే..హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పై వేటు

ప్రకాశం జిల్లా ఒంగోలు టూటౌన్‌ పీయస్‌లో విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్‌ కానిస్టేబుల్‌ సింగయ్య చౌదరి, కానిస్టేబుల్‌ మల్లేశ్వరరావులపై వేటు పడింది. వీరిద్దరిని వీఆర్‌కు పంపిస్తూ ఎస్‌పీ మలికగార్గ్‌ ఆదేశాలు జారీ చేశారు.

Andra Pradesh: పోలీస్ స్టేషన్ నుంచి పార్టీ కార్యకర్తను తీసుకెళ్లిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే..హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పై వేటు
Ycp Vs Tdp
Follow us
Aravind B

|

Updated on: Mar 14, 2023 | 4:06 PM

ప్రకాశం జిల్లా ఒంగోలు టూటౌన్‌ పీయస్‌లో విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్‌ కానిస్టేబుల్‌ సింగయ్య చౌదరి, కానిస్టేబుల్‌ మల్లేశ్వరరావులపై వేటు పడింది. వీరిద్దరిని వీఆర్‌కు పంపిస్తూ ఎస్‌పీ మలికగార్గ్‌ ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు అదుపులో ఉన్న టీడీపీ కార్యకర్తను విధులకు ఆటంకం కలిగించి తీసుకెళ్ళారంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌పై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే ఒంగోలు టూటౌన్‌ పీయస్‌లో పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ కార్యకర్త ఈశ్వర్‌ను టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ వెంట బెట్టుకుని తీసుకెళ్ళడం వివాదాస్పదంగా మారింది. అయితే జనార్దన్‌ పోలీసుల అదుపులో ఉన్న ఈశ్వర్‌ను బలవంతంగా తీసుకెళ్ళారంటూ వైసీపీ నేతలు ఎస్‌పీకి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

పోలీస్ స్టేషన్ లో అధికారులు లేని సమయంలో వచ్చిన టీపీపీ మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌.. స్టేషన్‌ సిబ్బందిని బలవంతపెట్టి వాళ్ల కార్యకర్తను తీసుకెళ్ళారంటూ వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సెయింట్ తెరెసా పోలింగ్‌ బూత్‌ దగ్గర జరిగిన గొడవలో పోలీసులు టీడీపీ కార్యకర్త ఈశ్వర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ గొడవలో తమ కార్యకర్తను వైసీపీ నేతలు చితకబాదడమే కాకుండా పోలీసుల సాయంతో అతడ్ని స్టేషన్‌కు తరలించారని టీపీపీ ఆరోపిస్తోంది. ఒంగోలు ఘర్షణ వ్యవహారం చంద్రబాబుకు తెలియగానే ప్రకాశం జిల్లా ఎస్‌పీకి ఫోన్‌ చేసి మాట్లాడారని, సాయంత్రం విడిచిపెడతారని ఎస్‌పీ చెప్పడంతో ఇప్పుడు తీసుకెళుతున్నామని జనార్ధన్‌ స్టేషన్‌ సిఐకి ఫోన్‌లో సమాచారం అందించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్బంగా దామచర్ల జనార్దన్‌ వెంట రౌడీ షీటర్‌ రాచగొర్ల వెంకట్రావు కూడా ఉండటంతో ఈ వ్యవహారం మరింత రాజుకుంది. ఇదిలా ఉండగా ఒంగోలు టూ టౌన్‌ పీయస్‌లో పోలీసుల అదుపులో ఉండగా నిబంధనలకు విరుద్దంగా తీసుకెళ్లడం, విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్‌ కానిస్టేబుల్‌ సింగయ్య చౌదరి, కానిస్టేబుల్‌ మల్లేశ్వరరావులపై  వేటు పడింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

ఇవి కూడా చదవండి