Ganesh Chaturthi 2023: నవరాత్రుల తర్వాత ఈ గణనాధుడిని నిమజ్జనం చేయకుండా నేరుగా బ్యాంకుకు.. ఎందుకో తెలుసా?
వినాయక చవితి అంటేనే భారీ గణనాధులు, వివిధ రూపాల్లో గణనాధుడు భక్తులకు దర్శనం ఇస్తాడు. నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్దలతో భక్తులు పూజిస్తారు. నవరాత్రులు పూజలందుకున్న గణనాధుడు నిమజ్జనం అత్యంత శోభాయమానంగా నిర్వహిస్తారు. కాని ఆ గణనాధుడు మాత్రం పూజలు అందుకుని నిమజ్జనం రోజు బ్యాంకు లాకర్లో భద్రంగా ఉంటాడు. మళ్ళీ వచ్చే ఏడాది వినాయక చవితికి మాత్రమే బ్యాంకు లాకర్ నుంచి బయటకు వస్తాడు. ఆ గణనాధుడు..

అనంతపురం, సెప్టెంబర్ 18: వినాయక చవితి అంటేనే భారీ గణనాధులు, వివిధ రూపాల్లో గణనాధుడు భక్తులకు దర్శనం ఇస్తాడు. నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్దలతో భక్తులు పూజిస్తారు. నవరాత్రులు పూజలందుకున్న గణనాధుడు నిమజ్జనం అత్యంత శోభాయమానంగా నిర్వహిస్తారు. కాని ఆ గణనాధుడు మాత్రం పూజలు అందుకుని నిమజ్జనం రోజు బ్యాంకు లాకర్లో భద్రంగా ఉంటాడు. మళ్ళీ వచ్చే ఏడాది వినాయక చవితికి మాత్రమే బ్యాంకు లాకర్ నుంచి బయటకు వస్తాడు. ఆ గణనాధుడు ఎందుకంత ప్రత్యేకత..
వైభవంగా వెండి వినాయకుడి ఊరేగింపు
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో వైభవంగా వెండి వినాయకుడి ఊరేగింపు నిర్వహించారు. వినాయక ఉత్సవ సేవాసమితి ఆధ్వర్యంలో 1996 సంవత్సరంలో ఆ వెండి గణనాథుడిని తయారు చేయించారు. 75 కేజీల బరువు ఉన్న ఈ వెండి వినాయకుడు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు సాధించింది. తర్వాత ఈ వెండి గణనాథుడికి పీఠము, ఇతర ఆభరణములతో కలిపి ప్రస్తుతం 125 కేజీల వెండితో అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రతి సంవత్సరం వినాయక చవితికి ముందు రోజు మాత్రమే బ్యాంకు లాకర్ నుంచి బయటకు వచ్చే ఈ గణనాథుడు ఉత్సవ విగ్రహదాతల ఇంటి వద్ద నుంచి మేళతాళాలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం వరకు పట్టణ పురవీధులలో ఊరేగింపుగా తీసుకువెళ్లి కొలువు తీరుస్తారు.
ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వెండి వినాయకుడు
ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కన్యకా పరమేశ్వరి ఆలయంకు చేరుకున్న గణనాథుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి 108 వెండి పుష్పములతో సహస్రపుష్పార్చన అనంతరం స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు. ఈ గణనాథుడిని వినాయక చవితి సందర్భంగా మాత్రమే ప్రజల దర్శనార్థం అందుబాటులో ఉంచుతారు. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఈ వెండి వినాయకుడిని గుంతకల్లు పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవం జరిగే రోజు వరకు భక్తులందరూ దర్శించుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. తర్వాత యధావిధిగా గణనాథుడిని వచ్చే వినాయక చవితి కొరకు తిరిగి భద్రంగా బ్యాంకు లాకర్ లో ఉంచడం ఆనవాయితీగా వస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




