AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త జిల్లాల ఏర్పాటుకు లైన్ క్లియర్.. కొత్తగా నాలుగు జిల్లాలు ఏర్పాటయ్యే ఛాన్స్!

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన ఆల్ మోస్ట్ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత తెలిపింది. నవంబర్ 10వ తేదీన జరిగే కేబినెట్ మీటింగ్‌లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లతో పాటు.. జిల్లాల సరిహద్దుల మార్పులపై క్లారిటీ రానుంది.

కొత్త జిల్లాల ఏర్పాటుకు లైన్ క్లియర్.. కొత్తగా నాలుగు జిల్లాలు ఏర్పాటయ్యే ఛాన్స్!
Ap New Districts
Balaraju Goud
|

Updated on: Nov 06, 2025 | 8:22 AM

Share

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన ఆల్ మోస్ట్ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత తెలిపింది. నవంబర్ 10వ తేదీన జరిగే కేబినెట్ మీటింగ్‌లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లతో పాటు.. జిల్లాల సరిహద్దుల మార్పులపై క్లారిటీ రానుంది. 4గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం.. వచ్చిన ప్రతిపాదనలు, సాధ్యసాధ్యాలపై చర్చించింది. రెండ్రోజుల్లో ప్రభుత్వానికి తమ నివేదిక ఇస్తామని, కేబినెట్ మీటింగ్‌లో తుది నిర్ణయం ఉంటుందని మంత్రులు తెలిపారు.

ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్‌ జిల్లాలో, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో, గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తిరిగి చేర్చే ప్రతిపాదనలకూ మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వ్యక్తం చేసింది. గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్‌ జిల్లాలో కలిపే అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కొత్తగా మరో ఆరు డివిజన్ల వరకు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇందులో.. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిరతోపాటు నక్కపల్లి, బనగానపల్లి రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.

జనగణన ప్రకారం డిసెంబర్ 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఏడుగురు సభ్యులతో కూడిన మంత్రుల ఉపసంఘం తొలి సమావేశం ఆగస్టు 13వ తేదీన రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఆ తర్వాత, జిల్లాల వారీగా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంఘాలు, ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. అలాగే ప్రాంతాల వారిగా వచ్చిన అభ్యర్థనలను ఉపసంఘానికి సమర్పించారు. మొత్తంగా, ఉపసంఘానికి దాదాపు 200 వరకు అర్జీలు స్వీకరించి, పరిశీలించి, మంత్రుల ఉప సంఘం విస్తృతంగా చర్చించింది. ఈ చర్చల్లో భాగంగా జిల్లాల అధికారుల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి