Andhra Pradesh: ‘ఉంటే ఉండండి.. పోతే పోండి’.. సంచలనంగా మారిన మంత్రి బొత్స కామెంట్స్..

ఎప్పుడూ కూల్‌గా ఉండే ఆ మంత్రి గారికి కోపం తన్నుకొచ్చింది. ఒక్కసారిగా పార్టీ కార్యకర్తలపై అంతెత్తు లేచారు. ఏందయ్యా మీ బాధ.. మీకేనా బాధలు మాకు లేవా? అంటూ కన్నెర్ర జేశారు. అంతేకాదండోయ్.. కార్యకర్తలంటే ఇలానే ఉంటారా..? బాధలు అదరికీ ఉంటాయి,

Andhra Pradesh: ‘ఉంటే ఉండండి.. పోతే పోండి’.. సంచలనంగా మారిన మంత్రి బొత్స కామెంట్స్..
Botsa Satyanarayana
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 09, 2023 | 8:51 AM

ఎప్పుడూ కూల్‌గా ఉండే ఆ మంత్రి గారికి కోపం తన్నుకొచ్చింది. ఒక్కసారిగా పార్టీ కార్యకర్తలపై అంతెత్తు లేచారు. ఏందయ్యా మీ బాధ.. మీకేనా బాధలు మాకు లేవా? అంటూ కన్నెర్ర జేశారు. అంతేకాదండోయ్.. కార్యకర్తలంటే ఇలానే ఉంటారా..? బాధలు అదరికీ ఉంటాయి, సమయం సందర్భం ఉండక్కర్లేదా.. యూజ్‌లెస్‌ ఫెలో అంటూ.. పార్టీలో ఉంటే ఉండండి, పోతే పోండి అంటూ తీవ్ర స్వరంతో అన్నారు. దాంతో తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చిన పార్టీ కార్యకర్తల ముఖం మాడిపోయింది. ఇంతకీ ఎవరా మంత్రి? ఎవరిని అన్నారు? ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? ఎక్కడ జరిగింది? ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం..

విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. ఆ సమయంలో అక్కడి నుంచి బయలుదేరుతుండగా.. ఎస్‌కోట టౌన్ అధ్యక్షుడు రెహమాన్ ఆయన్ను కలిశారు. స్థానిక పరిస్థితులు చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణా రాహిత్యం పెరిగిపోతుందంటూ ఫైర్ అయ్యారు. పార్టీలో ఉంటే ఉండండి పోతే పోండి అంటూ మండిపడ్డారు. బొత్స కామెంట్స్ తో ఆవాక్కయ్యారు కార్యకర్తలు. మంత్రి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. సమస్యలు చెప్పుకోవడానికి వస్తే ఇలాగేనా మాట్లాడేదంటూ పార్టీ కేడర్ గుర్రుగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..