Andhra Pradesh: ఒక అమ్మాయితో నిశ్చితార్థం, మరో అమ్మాయితో ప్రేమలో ఉన్న యువకుడు..చివరికి ఏం జరిగిందంటే
ఒక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోన్న యువకుడు మరో అమ్మయితో ప్రేమ వ్యవహారం నడిపిన ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని ఆజాద్ రోడ్డుకు చెంది నక్షత్ర అనే యువతి బెంగళూరులో డిగ్రీ చదువుతోంది.
ఒక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోన్న యువకుడు మరో అమ్మయితో ప్రేమ వ్యవహారం నడిపిన ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని ఆజాద్ రోడ్డుకు చెంది నక్షత్ర అనే యువతి బెంగళూరులో డిగ్రీ చదువుతోంది. అలాగే జయప్రకాశ్ రోడ్డుకు చెందిన ఆకాష్ అనే వ్యక్తి తరచుగా నక్షత్ర వెంటపడేవాడు. ప్రేమిస్తున్నానంటూ తిరిగేవాడు. అయితే కొన్నాళ్లకు అతడి మాటలు నమ్మిన నక్షత్ర ప్రేమలో పడింది. ఈ విషయం వాళ్లిద్దరి కుటుంబ సభ్యులకు తెలిసింది. వాళ్లు వివాహం చేయడానికి కూడా అంగీకరించారు. కానీ నక్షత్ర చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చెద్దామని ఆమె తల్లిదండ్రులు చెప్పడంతో ముందు నిశ్చితార్థం జరిపించారు.
అయితే ఈ క్రమంలోనే ఆకాష్ బుద్ధి మారింది. దాదాపు ఏడాది కాలం నుంచి అతను మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు నక్షత్రకు తెలిసింది. దీనిపై ప్రశ్నించగా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ సమస్యలన్నింటిని పరిష్కరించుకుందామని ఒకరాజు ఆకాష్ నక్షత్రను బెంగళూరులోని ఓ భవనంపైకి తీసుకెళ్లాడు. అక్కడ కాసేపు మాట్లాడుతున్నట్లు నటిస్తూ కిందకి తోసేశాడు. దీంతో నక్షత్ర కాలు విరగిపోవడంతో ఆమె వీల్ చైర్ కే పరిమితమైంది. ఈ విషయాన్నే సాకుగా చూపుతూ ఆకాష్ తల్లిదండ్రులు అడ్డం తిరిగారు. నడవలేని అమ్మాయిని పెళ్లి చేసుకోలేమని తేల్చి చెప్పేసారు. దీంతో నక్షత్ర, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..