YCP Vs Janasena: వైసీపీతో ఢీ అంటే ఢీ అంటున్న జనసేన.. తిరుపతి వేదికగా ఇరుపార్టీల మధ్య స్టిక్కర్ వార్

వైసీపీతో ఢీ అంటే ఢీ అంటున్న జనసేన.. ఇప్పుడిదే అంశంలో పోటీ కార్యక్రమం చేపట్టింది. వైసీపీ నాయకులనే ఫాలో అవుతున్న జనసేన నాయకులు.. వాళ్లు స్టిక్కర్లు వేసిన చోట.. జనసేన స్టిక్కర్లను అంటిస్తున్నారు.

YCP Vs Janasena: వైసీపీతో ఢీ అంటే ఢీ అంటున్న జనసేన.. తిరుపతి వేదికగా ఇరుపార్టీల మధ్య స్టిక్కర్ వార్
Tdp Vs Janasena
Follow us
Surya Kala

|

Updated on: Apr 09, 2023 | 9:50 AM

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అధికార వైసీపీ, జనసేన మధ్య వార్‌ ముదురుతోంది. ఇలాంటి సమయంలో.. తిరుపతి వేదికగా ఈ రెండు పార్టీల మధ్య కొత్త యుద్ధం మొదలైంది. తిరుపతిలో వైసీపీ జనసేన మద్య స్టిక్కర్ వార్ తెరమీదకొచ్చింది. సీఎం జగన్ పాలన, సంక్షేమ పథకాల అమలు తీరును జనంలోకి తీసుకెళుతున్న వైసీపీ. ఇంటింటికీ వెళ్లి ”మా నమ్మకం నువ్వే జగన్ ” నినాదంతో కూడిన స్టిక్కర్లను అంటిస్తోంది. సీఎం జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక అమల్లోకి వచ్చిన పథకాలను, అభివృద్ధిని జనాలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు.

వైసీపీతో ఢీ అంటే ఢీ అంటున్న జనసేన.. ఇప్పుడిదే అంశంలో పోటీ కార్యక్రమం చేపట్టింది. వైసీపీ నాయకులనే ఫాలో అవుతున్న జనసేన నాయకులు.. వాళ్లు స్టిక్కర్లు వేసిన చోట.. జనసేన స్టిక్కర్లను అంటిస్తున్నారు. మాకు నమ్మకం లేదు జగన్, మా నమ్మకం పవన్ అనే నినాదాలతో ఉన్న స్టిక్కర్లను ప్రతీ ఇంటి గోడకు అతికిస్తున్నారు.

ఇప్పుడీ రెండు పార్టీల తీరు.. తిరుపతిలో రాజకీయంగా దుమారం రేపుతోంది. అభివృద్ధి, సంక్షేమం విషయంలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచిందని వైసీపీ చెబుతుంటే.. నాలుగేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను జగన్‌ నెరవేర్చలేదంటూ.. జనసేన ఆరోపిస్తోంది. జగన్ పై నమ్మకం ఉందా అంటూ.. కనిపించినవారినల్లా ప్రశ్నిస్తోంది. అయితే, జగన్‌పై నమ్మకం లేదంటూ స్టిక్కర్లు వేస్తుంటే.. పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు జనసేన నేతలు. మరి ఈ స్టిక్కర్ల వార్‌ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో