Bricks Festival: మన్యంలో ఇటుకల పండగ సందడి.. బావా బామ్మర్దులు, అక్కాచెల్లెళ్లు మధ్య జరిగే బడ్డు ఉత్సవం ప్రత్యేక ఆకర్షణ

గిరిజనుల జీవనశైలి ఓ ప్రత్యేకం. వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఒక్క ప్రాంతంలో ఒక్క విధంగా పండుగలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఆలూరు మన్యంలో చైత్రమాసంలో సాంప్రదాయపద్ధంగా ఇటుకల పండుగ నిర్వహించడం ఆనవాయితీ. ప్రస్తుతం ఆ పండుగ సందడి కనిపిస్తోంది. 

Bricks Festival: మన్యంలో ఇటుకల పండగ సందడి.. బావా బామ్మర్దులు, అక్కాచెల్లెళ్లు మధ్య జరిగే బడ్డు ఉత్సవం ప్రత్యేక ఆకర్షణ
Brick Festival In Agency
Follow us
Surya Kala

|

Updated on: Apr 09, 2023 | 10:10 AM

ఆల్లూరి మన్యంలో అప్పుడే ఇటుకల పండగ సందడి మొదలైంది. గ్రామాల్లోని గిరిజనలంతా ఈ పండుగ గిరిజన సంప్రదాయ నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకుంటారు. బంధుమిత్రులు సపరివార సమేతంగా విల్లు ఆరగిస్తారు. ఇందులో భాగంగా బావా బామ్మర్దులు, అక్కాచెల్లెళ్లు వదిన మరదళ్ళు మధ్య జరిగే బడ్డు ఉత్సవం ప్రత్యేక ఆకర్షణ.

గిరిజనుల జీవనశైలి ఓ ప్రత్యేకం. వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఒక్క ప్రాంతంలో ఒక్క విధంగా పండుగలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఆలూరు మన్యంలో చైత్రమాసంలో సాంప్రదాయపద్ధంగా ఇటుకల పండుగ నిర్వహించడం ఆనవాయితీ. ప్రస్తుతం ఆ పండుగ సందడి కనిపిస్తోంది. పాత పాడేరులో ఇటుకల పండుగ సందడిగా సాగుతోంది. జిల్లా కేంద్రంలోని పాత పాడేరులో బడ్డు ఉత్సవం ఉత్సాహంగా సాగింది. అన్నదమ్ములు – బామ్మర్దులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్నదమ్ములు ఒకవైపు బావ బామ్మర్దుల మరోవైపు బలబలాలపోటీ రసవత్తరంగా సాగింది. ఇరువైపుల వారు గెలుపు కోసం బడ్డు లాగడం ఆనవాయితీ. బల ప్రదర్శన కార్యక్రమం చివరిదాకా రసవత్తరంగా సాగిన బడ్డులో చివరికి అన్నదమ్ములే గెలుపు సాధించారు.

గిరిజనులు నిర్వహించుకునే పండుగలు వారి జీవన విధానాన్ని ప్రతిబింబ చేస్తాయి. అన్నదమ్ములు గెలుపుతో గ్రామంలో ప్రజలు ఈ ఏడాది పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉంటారని విశ్వసిస్తారు. ఇటుకుల పండుగలో భాగంగా ఈ గ్రామంలో అక్కాచెల్లెళ్ళు వదిన మరదళ్ల మధ్య కూడ బడ్డు ఉత్సవం జరుగుతుంది. దింసా నృత్యాలతో గ్రామ చావిడి లో నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..