Andhra Pradesh: ఏపీలో8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు.. విజయవాడ కమిషనర్ గా ఎవరు రానున్నారంటే..
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని పలువురు ఐఏఎస్ అధికారుల(IAS Officers)ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని పలువురు ఐఏఎస్ అధికారుల(IAS Officers)ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సుమారు 8 మంది అధికారులను బదిలీ(Transfer) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల్లో భాగంగా మైనారిటీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గా కె. సునీత నియమితులయ్యారు. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ స్పెషల్ సెక్రెటరీ గా గంధం చంద్రుడిని బదిలీచేశారు. ఇక కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్ గా కార్తికేయ మిశ్రాను నియమించారు. ఇక కాపు కొర్పొరేషన్ ఎండీగా రేఖా రాణి నియమితులయ్యారు.
విజయవాడ కమిషనర్ గా..
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా ప్రసన్న వెంకటేష్ బాధ్యతలు స్వీకరించనుండగా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ గా రంజిత్ బాషా త్వరలోనే విధుల్లో చేరనున్నారు. ఇక ఎంఎస్ఎంఈ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సీఈవోగా ఎన్వీ రమణారెడ్డిని ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా ఏపీ భవన్ స్పెషల్ ఆఫీసర్ గా హిమాన్షు కౌశిక్ కుఅదనపు బాధ్యతలుఅప్పగించారు. ఇక సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ సొసైటీ సెక్రెటరీ గా ITS అధికారి పవన్ మూర్తి నియమితులయ్యారు.
Also Read: Viral Video: ఆ కారు డ్రైవర్ యూటర్న్ తీసుకునేందుకు 80 నిమిషాలు తీసుకున్నాడు.. కారణమేంటంటే..
Srisailam: నేటి నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి ఆన్‌లైన్ టికెట్లు.. ఎలా బుక్ చేసుకోవాలంటే..
Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నేడు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..