AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆ కారు డ్రైవర్ యూటర్న్ తీసుకునేందుకు 80 నిమిషాలు తీసుకున్నాడు.. కారణమేంటంటే..

సాధారణంగా రోడ్లపై యూటర్న్ (U-Turn) తీసుకునేటప్పుడు ఒకటి లేదా రెండు నిమిషాలు తీసుకుంటాం. మరీ వాహనాల రద్దీ  బాగా ఉండి, ఇరుకు రహదారులు  ఉంటే ఐదు నిమిషాలు తీసుకుంటాం .

Viral Video: ఆ కారు డ్రైవర్ యూటర్న్ తీసుకునేందుకు 80 నిమిషాలు తీసుకున్నాడు.. కారణమేంటంటే..
Basha Shek
|

Updated on: Jan 25, 2022 | 8:37 AM

Share

సాధారణంగా రోడ్లపై యూటర్న్ (U-Turn) తీసుకునేటప్పుడు ఒకటి లేదా రెండు నిమిషాలు తీసుకుంటాం. మరీ వాహనాల రద్దీ  బాగా ఉండి, ఇరుకు రహదారులు  ఉంటే ఐదు నిమిషాలు తీసుకుంటాం . అయితే ఘాట్ రోడ్లు (ghat roads), మలుపులు, వనే వే రహదారుల్లో యూటర్న్ లు తీసుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని.  డ్రైవర్ (Driver) కు ఎంతో నైపుణ్యముంటేనే యూటర్న్ సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఒక వాహనదారుడు తన కారును యూటర్న్ చేసుకోవడానికి ఏకంగా 80 నిమిషాలు తీసుకున్నాడు. ఎందుకంటే అతను ఉన్నది కొండ చివరి అంచున. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు గాలిలో కలిసిపోక తప్పదు. అందుకే ఎంతో ఓపిక తెచ్చుకుని తనకున్న నైపుణ్యంతో అనుకున్నది సాధించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

డ్రైవింగ్‌స్కిల్ అనే యూట్యూబ్ ఛానెల్ గతేడాది  డిసెంబర్‌లో మొదటిసారిగా ఈ వీడియోని షేర్ చేసింది.  ఈ సందర్భంగా  కారు డ్రైవర్ ఇరుకైన రహదారుల్లో యూటర్న్ లు తీసుకోవడంలో ఎంతో నిపుణుడని పేర్కొంది. దీంతో నెటిజన్లు ఆ డ్రైవర్‌ నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ  మళ్లీ ఈ వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేస్తున్నారు.

ఇక ఇదే ఇంటర్నెట్ లో మరో వీడియో కూడా హల్ చల్ చేస్తోంది.  పై వీడియోకి ఒరిజినల్‌ అనే అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. మరి.. ఈ రెండిటిలో ఏది నిజమో తెలుసుకోవాలంటే కొంచెం కష్టమే.

Also Read: Srisailam: నేటి నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి ఆన్‌లైన్‌ టికెట్లు.. ఎలా బుక్ చేసుకోవాలంటే..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నేడు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Water Supply: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం.. ఎప్పుడంటే..