AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్వం సిద్దం! రెండ్రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం!!

AP New Districts: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను...

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్వం సిద్దం! రెండ్రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం!!
Ap New Districts
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 25, 2022 | 9:40 AM

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం రెండు లేదా మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉగాదిలోపు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేసి.. కొత్త జిల్లాల(New Districts)ను అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోన్నట్లు సమాచారం. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతీ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందే వైసీపీ(YSRCP) తమ మేనిఫెస్టోలో పొందుపరిచింది. అయితే కరోనా కారణంగా 2021 జనాభా లెక్కల సేకరణ వాయిదా పడింది. దీనితో కొత్త జిల్లాల ఏర్పాటుపై జాప్యం ఏర్పడింది.

Also Read: Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే! అంత ఈజీ కాదండోయ్.!

కొత్తగా మరో 13 జిల్లాలు ఇవేనా..

ఏపీలో 25 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు తోడుగా ప్రభుత్వం కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయనుంది. అరకు (2 జిల్లాలు(భౌగోళికంగా ఎక్కువగా విస్తరించి ఉండటంతో)), అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, బాపట్ల, నంద్యాల, హిందూపురం, రాజంపేట కొత్త జిల్లాలుగా ఏర్పాటు కానున్నాయని సమాచారం.

Also Read: Dragon Fruit: ఈ 3 వ్యాధులను దూరం చేసే దివ్య ఔషధం.. తింటే తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

కాగా, కొత్త జిల్లాల ఏర్పాటుపై రెవిన్యూ శాఖ తొలుత ప్రాధమిక నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఆ తర్వాత దానిపై సూచనలు, సలహాల కోసం 30 రోజులు గడువు ఇవ్వనుండగా.. వాటిన్నంటినీ పరిశీలించిన తర్వాత మార్పులు చేర్పులు చేసి తుది నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. తుది నోటిఫికేషన్‌లోనే కొత్త జిల్లాలు అమలులోకి వచ్చే అఫీషియల్ డేట్ ఉంటుంది.

Also Read:

Viral Video: ఇదేంది సామీ.! స్వీట్ చట్నీతో జిలేబీ చాట్.. పేకాటాడేస్తున్న నెటిజన్లు.. వైరల్ వీడియో!

Viral Video: తగ్గేదేలే.! సింహంతో సెల్ఫీ.. కట్ చేస్తే చివర్లో ఊహించని ట్విస్ట్.. వైరల్ వీడియో!