AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSR EBC Nestham: అగ్రవర్ణాల మహిళలకు ఆర్థిక సాయం.. వారి ఖాతాల్లో రూ.589 కోట్లు జమ చేసిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సంపన్న వర్గాల్లో వెనుకబడిన పేదలను ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో ఈ స్కీంను తీసుకువచ్చింది.

YSR EBC Nestham: అగ్రవర్ణాల మహిళలకు ఆర్థిక సాయం.. వారి ఖాతాల్లో రూ.589 కోట్లు జమ చేసిన సీఎం జగన్
Cm Jagan
Balaraju Goud
|

Updated on: Jan 25, 2022 | 12:47 PM

Share

Andhra Pradesh YSR EBC Nestham: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సంపన్న వర్గాల్లో వెనుకబడిన పేదలను ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో ఈ స్కీంను తీసుకువచ్చింది. ఇప్పటికే జగనన్న అమ్మఒడి , వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం (YSR Kapu Nestham), ఉచిత ఇళ్ళ పట్టాల వంటి పథకాలను మహిళల పేరుతో అందించిన ప్రభుత్వం మరో పథకాన్ని.. మహిళల పేరుతో ప్రారంభించింది.

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పేరుతో పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేరుగా మహిళల ఖాతాల్లోకి నగదు జమ చేశారు. వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమాన్ని తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి మహిళ ఖాతలాల్లో రూ.589 కోట్లు నగదు జమ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాల కోసం వైఎస్ఆర్ ఈసీబీ నేస్తం మొదటి విడత పథకాన్ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు..

రాజ్యాంగ స్పూర్తిని అనుసరిస్తూ పేదల సంక్షేమానికి కృషీ చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ పథకం ద్వారా అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నామని పేర్కొన్నారు. అగ్రవర్ణ పేద మహిళలకు మంచి చేయాలనే ఉద్ధేశ్యంతో ఈబీసీ నేస్తం పథకం తీసుకొచ్చినట్లు సీఎం వెల్లడించారు. మ్యానిఫెస్టోలో పెట్టలేదు.. ఏ ఎన్నికల్లో హామీ ఇవ్వలేదని.. అయినా మహిళ కష్టాలను అర్థం చేసుకున్న ఒక అన్నగా తాను ఈ పతకానికి శ్రీకారం చుట్టాను అన్నారు సీఎం జగన్.. రాష్ట్రంలో అగ్రవర్ణంలో ఉన్న పేదల ఇబ్బందులు కూడా గుర్తించాని అందుకే ఈ పథకంలో చెల్లమ్మలకు అండగా నిలడబడాలని నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

ఈ పథకం ద్వారా రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్యు, క్షత్రియ, వెలమ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న పేద మహిళలకు ఆర్థిక సాయ చేకూరుతుందని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 3,92,674 మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు.