Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మహిళలను వేధిస్తే ఊచలు లెక్క పెట్టాల్సిందే.. దిశ యాప్‌తో భారీగా శిక్షలు వేస్తున్న ఏపీ సర్కార్..

దిశా యాప్ ను 1.52 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 28,585 ఘటనల్లో బాధితులు ఇప్పటి వరకు దిశ సహాయం అందుకున్నారు. దిశా కాల్స్ కోసం 51 మంది పని చేస్తూ 24 గంటలు కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. 18 దిశా ప్రత్యేక పోలీస్ స్టేషన్స్, 21 మంది పీపీలు, 25 ప్రత్యేక కోర్టులు దిశా కార్యక్రమాన్ని సమర్థవతంగా అమలు చేస్తున్నాయి. 900 వాహనాలు దిశా కోసం పని చేస్తున్నాయి. 

Andhra Pradesh: మహిళలను వేధిస్తే ఊచలు లెక్క పెట్టాల్సిందే.. దిశ యాప్‌తో భారీగా శిక్షలు వేస్తున్న ఏపీ సర్కార్..
Disha App
P Kranthi Prasanna
| Edited By: Surya Kala|

Updated on: Nov 10, 2023 | 12:59 PM

Share

ఏపి సర్కార్ విప్లాత్మకంగా తీసుకుని వచ్చిన దిశా యాప్ రాష్ట్ర వ్యాప్తంగా దూసుకుపోతుంది. మహిళల చేతిలో ఆయుధంగా ఆకతాయిల ఆట కట్టిస్తుంది. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటూ బాధితులు స్వేచ్చగా, నేరుగా ఫిర్యాదు చెయ్యటానికి 24 గంటలు అందుబాటులో ఉన్న దిశా యాప్ నిందితులకు చుక్కలు చూపిస్తుంది. ఆపదలో ఉన్న వారికి అండగా ఉండటం మాత్రమే కాదు నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు వెయ్యటంలోను దిశా యాప్ సమర్థవంతంగా ముందుకు దూసుకుపోతుంది. అన్ని వర్గాలకు చెందిన మహిళలు, చిన్నారు లు, ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల మహిళలు, పిల్లలకు న్యాయం చెయ్యటంలో దిశా యాప్ గణనీయమైన పాత్ర పోషిస్తుంది.

ఇప్పటి వరకు దిశా యాప్ ను 1.52 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 28,585 ఘటనల్లో బాధితులు ఇప్పటి వరకు దిశ సహాయం అందుకున్నారు. దిశా కాల్స్ కోసం 51 మంది పని చేస్తూ 24 గంటలు కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. 18 దిశా ప్రత్యేక పోలీస్ స్టేషన్స్, 21 మంది పీపీలు, 25 ప్రత్యేక కోర్టులు దిశా కార్యక్రమాన్ని సమర్థవతంగా అమలు చేస్తున్నాయి. 900 వాహనాలు దిశా కోసం పని చేస్తున్నాయి.

కాల్ చేసినా లేదా దిశా యాప్ 🆘 క్లిక్ చేసిన సిటీల్లో అయితే ఐదు నిమిషాల్లో గ్రామీణ పలెల్లో అయితే 15 నిమిషాల్లో ఘటాన స్థలానికి చేరుకుని బాధితులకు అండగా ఉంటున్నారు. ప్రత్యేక వాహనాలు, క్లూస్ టీమ్, ఫోరెన్సిక్, అవసరమైన మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటంతో దిశా కేసుల విచారణ సమయం పొక్సో కేసుల్లో 44 రోజులకు , అత్యాచార, లైంగిక వేధింపుల ఘటనల్లో విచారణ 60 రోజుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు. నమోదైన కేసుల్లో 91 శాతం కేసులు విచారణ పూర్తి చేసిన ఘనత ఏపి కు ఉంది. దేశంలో దీని సగటు 40 శాతం మాత్రమే ఉంది. కంప్లియన్స్ రేటులో ఏపి ప్రధమ స్థానంలో ఉంది. దిశా కార్యక్రమం ప్రారంభం అయిన తర్వాత జూన్ 15 ,2003 వరకు 152 కేసుల్లో కటిన శిక్షలు పడ్డాయి. 5 గురికి ఊరి శిక్షలు పడితే,53 మందికి పైగా జీవిత ఖైదీ శిక్షలు పడ్డాయి. 20 ఏళ్ళు పైబడి 40 మందికి,10 ఏళ్లకు పై బడి 41 మందికి, 7 ఏళ్లకు పై బడి 13 మందికి శిక్షలు పడ్డాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అందానికి కలిసిరాని అదృష్టం.. ఆఫర్స్ కోసం చిట్టి వెయిటింగ్..
అందానికి కలిసిరాని అదృష్టం.. ఆఫర్స్ కోసం చిట్టి వెయిటింగ్..
ఈ 5 హెయిర్ ప్యాక్స్‎తో చుండ్రు సమస్యకి ఫుల్ స్టాప్..
ఈ 5 హెయిర్ ప్యాక్స్‎తో చుండ్రు సమస్యకి ఫుల్ స్టాప్..
సామాన్యుల్లో ఒకరిగా అపర కుబేరుడు.. పబ్లిక్‌ ట్రామ్‌లో దుబాయ్‌రాజు
సామాన్యుల్లో ఒకరిగా అపర కుబేరుడు.. పబ్లిక్‌ ట్రామ్‌లో దుబాయ్‌రాజు
కళ్లులేని బిచ్చగాడికి ఇద్దరు పెళ్లాలు..రోజుకు 3వేలు సంపానా, అయినా
కళ్లులేని బిచ్చగాడికి ఇద్దరు పెళ్లాలు..రోజుకు 3వేలు సంపానా, అయినా
Tsunami Alert: ఆ ముప్పై దేశాలపై సునామి ఎఫెక్ట్‌...
Tsunami Alert: ఆ ముప్పై దేశాలపై సునామి ఎఫెక్ట్‌...
డ్రైవింగ్‌ లైసెన్స్‌లో ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారో తెలుసా?
డ్రైవింగ్‌ లైసెన్స్‌లో ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారో తెలుసా?
అతడికి 19, ఆమెకు 38..వింత లవ్ స్టోరీ వీడియో
అతడికి 19, ఆమెకు 38..వింత లవ్ స్టోరీ వీడియో
బిస్కెట్లు కూడా తింటున్నారా? ఈ అలవాటును త్వరగా మానేయండి
బిస్కెట్లు కూడా తింటున్నారా? ఈ అలవాటును త్వరగా మానేయండి
భర్త నాలుకను కొరికి నమిలేసిన భార్య.. ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్
భర్త నాలుకను కొరికి నమిలేసిన భార్య.. ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్
నడిరోడ్డులో గుర్రాల ఘర్షణ.. ఆ తర్వాత ఏమైందంటే వీడియో
నడిరోడ్డులో గుర్రాల ఘర్షణ.. ఆ తర్వాత ఏమైందంటే వీడియో