దేశ విదేశాల్లో దీపావళి సందడి మొదలైంది. దీపావళి వేడుకలను హిందువులు అత్యంత ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ హిందూ సమాజంతో కలిసి ముందుగా నిర్వహించిన దీపావళి వేడుకలను జరుపుకున్నారు. లండన్ లో ఘనంగా నిర్వహించిన దీపావళి వేడుకల్లో ప్రధాని రిషి తన భార్యతో సహా హాజరయ్యారు.