Cricket Rules : క్యాచ్ పట్టగానే బంతిని గాలిలోకి ఎందుకు విసురుతారు? దీని వెనుక ఉన్న అసలు రూల్ ఇదే
Cricket Rules : క్రికెట్ అంటే కేవలం బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు.. అందులో అంతుచిక్కని ఎన్నో ఆసక్తికరమైన నియమాలు ఉన్నాయి. సాధారణంగా మనం మ్యాచ్ చూస్తున్నప్పుడు ఏదైనా వికెట్ పడగానే, ముఖ్యంగా క్యాచ్ పట్టుకోగానే ఫీల్డర్ ఆ బంతిని గాలిలోకి విసిరి మళ్ళీ పట్టుకోవడం గమనిస్తుంటాం. చాలామంది ఇది కేవలం సంబరాలు చేసుకోవడానికి చేసే పని అని అనుకుంటారు.

Cricket Rules : క్రికెట్ అంటే కేవలం బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు.. అందులో అంతుచిక్కని ఎన్నో ఆసక్తికరమైన నియమాలు ఉన్నాయి. సాధారణంగా మనం మ్యాచ్ చూస్తున్నప్పుడు ఏదైనా వికెట్ పడగానే, ముఖ్యంగా క్యాచ్ పట్టుకోగానే ఫీల్డర్ ఆ బంతిని గాలిలోకి విసిరి మళ్ళీ పట్టుకోవడం గమనిస్తుంటాం. చాలామంది ఇది కేవలం సంబరాలు చేసుకోవడానికి చేసే పని అని అనుకుంటారు. కానీ దీని వెనుక క్రికెట్ చరిత్రకు సంబంధించిన ఒక బలమైన కారణం, ఐసీసీ నిబంధన ఉంది. క్రికెట్ నిబంధనల ప్రకారం.. ఒక క్యాచ్‌ను పూర్తిస్థాయిలో లీగల్ క్యాచ్ అని ఎప్పుడు అంటారంటే.. ఫీల్డర్ ఆ బంతిని పట్టుకున్నప్పుడు దానిపై తనకు పూర్తి నియంత్రణ ఉందని నిరూపించుకోవాలి. పాత రోజుల్లో ఇప్పుడున్నట్టుగా థర్డ్ అంపైర్లు, సూపర్ స్లో మోషన్ కెమెరాలు, డీఆర్ఎస్ వంటి అత్యాధునిక సాంకేతిక పరికరాలు ఉండేవి కావు. ఆ సమయంలో ఫీల్డర్ క్యాచ్ పట్టాక, బంతి తన చేతిలో స్థిరంగా ఉందని అంపైర్‌కు ఒక సంకేతం ఇవ్వాల్సి వచ్చేది.
ఫీల్డర్ క్యాచ్ పట్టుకున్న తర్వాత బంతిని గాలిలోకి విసిరి మళ్ళీ పట్టుకోవడం ద్వారా.. “చూడండి అంపైర్ గారూ, బంతి నా కంట్రోల్‌లో ఉంది, నేను కావాలనే దీన్ని విసిరాను, ఇది నా చేతిలోంచి జారిపోలేదు” అని నిరూపించేవారు. ఇది ఒక రకమైన కన్ఫర్మేషన్ సిగ్నల్ అన్నమాట. కాలక్రమేణా కెమెరాలు వచ్చినా, టెక్నాలజీ పెరిగినా.. ఆ పాత అలవాటు నేటికీ ఆటగాళ్లలో కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు అది ఒక సంబరంగా మారిపోయిందే తప్ప, నిబంధనల రీత్యా దాని ప్రాధాన్యత కొంచెం తగ్గింది.
ఐసీసీ నిబంధనల ప్రకారం క్యాచ్ ఎప్పుడు చెల్లుతుంది?
క్యాచ్ అవుట్ ఇవ్వాలంటే కొన్ని ప్రాథమిక నియమాలు ఖచ్చితంగా పాటించాలి. మొదటిది బౌలర్ వేసిన బంతి నో బాల్ కాకూడదు. బ్యాటర్ కొట్టిన బంతి నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లాలి లేదా బ్యాట్ అంచుకు తగిలి వెళ్లాలి. బంతి నేలను తాకకముందే ఫీల్డర్ దానిని ఒడిసి పట్టుకోవాలి. ఒకవేళ ఫీల్డర్ వేళ్లు బంతి కింద ఉండి, అరచేయి నేలను తాకినా అది లీగల్ క్యాచ్‌గానే పరిగణించబడుతుంది.
ఫెయిర్ క్యాచ్ అంటే ఏమిటి?
ఫీల్డర్ క్యాచ్ పట్టే క్రమంలో బౌండరీ లైన్‌ను తాకకూడదు. ఒకవేళ గాలిలో ఉండి క్యాచ్ పట్టినా, బంతిని వదిలే సమయానికి ఫీల్డర్ బౌండరీ లోపలే ఉండాలి. బంతి ఏ దశలోనూ నేలను గానీ, బౌండరీ లైన్ బయట ఉన్న వస్తువులను గానీ తాకకూడదు. ఫీల్డర్ బంతిని పట్టుకున్న తర్వాత తన శరీరంపై, కదలికలపై పూర్తి నియంత్రణ సాధించినప్పుడే అంపైర్ దానిని అవుట్‌గా ప్రకటిస్తారు. అందుకే ఫీల్డర్లు ఆ నియంత్రణను చూపించడానికి బంతిని గాలిలోకి విసిరి సంబరాలు చేసుకుంటారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
