సాయి పల్లవి గ్లామర్ షో ఎందుకు వేసుకోదో తెలుసా.. ?
Rajitha Chanti
Pic credit - Instagram
29 January 2026
ఇన్నాళ్లు సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్ సాయి పల్లవి.. ఇప్పుడు బాలీవుడ్ లో తెరంగేట్రం చేస్తుంది.
న్యాచురల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తక్కువ మేకప్, గ్లామర్ షోకు దూరంగా ఉంటుంది.
అయినప్పటికీ ఆమె డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలలో నటిస్తుంది ఈ బ్యూటీ.
సాయి పల్లవి మేకప్ చాలా తక్కువగా వేసుకుంటుంది. అలాగే పొట్టి బట్టలు ధరించదు. ఇంతకీ కారణం తెలుసా.. ?
తన కాలేజీ రోజుల్లో జరిగిన ఒక సంఘటనే తాను పొట్టి బట్టలు వేయకపోవడానికి కారణమని చెప్పుకొచ్చారు.
కాలేజీలో ఉన్నప్పుడు సాయి పల్లవి ఒక డ్యాన్స్ పోటీలో పాల్గొన్నానని అప్పుడు స్లిట్ డ్రెస్ ధరించినట్లు తెలిపింది.
ఆ డ్యాన్స్ వీడియో వైరల్ కావడంతో ఆమెను విపరీతంగా ట్రోల్స్ వచ్చాయని.. దీంతో డిస్టర్బ్ అయ్యినట్లు తెలిపింది.
ఆ ఘటన తర్వాత తాను పొట్టి దుస్తులకు దూరంగా ఉంటున్నానని.. పాత్రకు తగినప్పుడు మాత్రమే వేస్తుందట.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్