Dhanteras 2022: నేడు ధన్‌తేరాస్.. షాపింగ్, పూజ విధానం, శుభ సమయం ఎప్పుడంటే..
దీపావళి రోజున పూజ కోసం ధన్ తేరాస్ రోజున లక్ష్మీ దేవి, గణపతి విగ్రహాలను కొనుగోలు చేయాలని ఒక నమ్మకం. ఈ రోజున మీరు లక్ష్మీదేవి, గణపతి బంగారం, వెండి విగ్రహాలను కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ రోజున కొనుగోలు చేసిన బంగారు, వెండి నాణేలను కొనుగోలు చేయడం కూడా శ్రేయస్కరం. బంగారం, వెండి వస్తువులే కాకుండా ఇత్తడి, రాగి వంటి వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ రోజున మీరు ఏదైనా పాత్రను కొనుగోలు చేస్తే వాటిని ఖాళీగా ఇంటికి తీసుకురాకూడదని నమ్ముతారు.

ఐదు రోజుల దీపావళి పండుగ ధన్‌తేరస్‌తో ప్రారంభమవుతుంది. ధన్‌తేరస్ రోజున కొత్త వస్తువులు కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. ఈ రోజు ఏదైనా కొత్త వస్తువును కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని సుఖ సంపదలు లభిస్తాయని విశ్వాసం. ఈ రోజున ఏదైనా కొత్త వస్తువును కొనుగోలు చేసే ముందు శుభ ముహూర్తం చూసుకుని తదనుగుణంగా కొనుగోలు చేస్తారు. ఏ శుభ ముహూర్తంలో ఏం కొనాలి.. ఎలా పూజ చేయాలి రోజు తెలుసుకుందాం..
ధన్‌తేరస్‌లో బంగారం, వెండి నగలను కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ప్రజలు చీపురు నుండి కార్లు, ఇంటిలో ఉపయోగించే వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ రోజు ధన్‌తేరస్ శుభ సందర్భంగా బంగారం, వెండిని కొనుగోలు చేయబోతున్నట్లయితే శుభ సమయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
దీపావళి రోజున పూజ కోసం ధన్ తేరాస్ రోజున లక్ష్మీ దేవి, గణపతి విగ్రహాలను కొనుగోలు చేయాలని ఒక నమ్మకం. ఈ రోజున మీరు లక్ష్మీదేవి, గణపతి బంగారం, వెండి విగ్రహాలను కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ రోజున కొనుగోలు చేసిన బంగారు, వెండి నాణేలను కొనుగోలు చేయడం కూడా శ్రేయస్కరం. బంగారం, వెండి వస్తువులే కాకుండా ఇత్తడి, రాగి వంటి వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ రోజున మీరు ఏదైనా పాత్రను కొనుగోలు చేస్తే వాటిని ఖాళీగా ఇంటికి తీసుకురాకూడదని నమ్ముతారు. వాటిని మీరు ధాన్యాలు, బియ్యం లేదా నీటితో కూడా నింపవచ్చు. ధన్ తేరాస్ రోజు నుంచి ఇంట్లో దీపాలు వెలిగిస్తారు.
షాపింగ్ చేయడానికి అనుకూలమైన సమయం
ధన్‌తేరస్ రోజునే షాపింగ్ చేయడానికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. పంచాంగం ప్రకారం నవంబర్ 10న ధన్‌తేరాస్ రోజున షాపింగ్ చేయడానికి అనుకూలమైన సమయం మధ్యాహ్నం 12:56 నుంచి మధ్యాహ్నం 2:06 వరకు ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 4:16 నుంచి 5:26 వరకు ఉంటుంది. ఈ శుభ సమయంలో మీరు ఏదైనా వస్తువులు కొనుగోళ్లు చేయలేకపోతే.. నవంబర్ 11 వరకు ఏదైనా కొనుగోలు చేయవచ్చు.
ధన్‌తేరస్‌లో పూజకు అనుకూలమైన సమయం
ధన్‌తేరస్ రోజున లక్ష్మీ దేవి, గణపతిలతో పాటు సంపదకు దేవుడు అయిన కుబేరుడిని పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు ధన్ తేరాస్ రోజున లక్ష్మీ దేవిని ఆరాధించే శుభ సమయం సాయంత్రం 5:47 నుండి 7:47 వరకు ప్రారంభమవుతుంది. ఈ 2 గంటలలో లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే ప్రదోష కాలంలో పూజ శుభ సమయం 8:08 వరకు ఉంటుంది. ధన్‌తేరస్‌లో దీపాలను దానం చేయడానికి అనుకూలమైన సమయం సాయంత్రం 5:47 నుండి రాత్రి 8:26 వరకు ఉంటుంది.
ధన్ తేరాస్ పూజా విధానం
- ధన్ తేరాస్ రోజునపీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని వేయండి.
- దీని తరువాత ఆ ప్రదేశంలో గంగాజలం చల్లి, ఆపై లక్ష్మీ దేవి, ధన్వంతరి, కుబేరుల విగ్రహాలను ప్రతిష్టించండి.
- ఆ తర్వాత ఈ దేవతామూర్తుల ముందు స్వచ్ఛమైన నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ధూపం, దీపం, అగరబత్తీలు వెలిగించి ఎరుపు పువ్వులతో పూజలు చేయండి.
- ధన్తేరస్ రోజున రాగి, లోహం లేదా బంగారం కొనుగోలు చేసినా దానిని దేవుని ముందు ఉంచండి.
- అనంతరం లక్ష్మీ స్తోత్రం, లక్ష్మీ చాలీసా, కుబేర్ యంత్రం, కుబేర్ స్తోత్రం, లక్ష్మీ యంత్రాన్ని పఠించండి.
- ధన్‌తేరస్‌లో ఈ పద్ధతితో పూజించిన తర్వాత, లక్ష్మీ దేవి మంత్రాలను జపించి నైవేద్యాన్ని సమర్పించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు








