Gold and Silver Prices Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ధన్ తేరాస్ ముందు దిగివస్తున్న బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంత ఉన్నాయంటే..
భారత్‌లో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. ధన్వంతరి జయంతి లేదా ధన్‌తేరస్ పండుగ రోజు బంగారం కొనుగోలు చేసే వారికి ఇది శుభవార్త. భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా బంగారం ధర తగ్గింది. భారతదేశంలో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,700 రూపాయలుండగా 24 క్యారెట్స్ పసిడి ధర రూ.60,760. లు ఉంది.
భారతీయుల మగువలకు బంగారానికి విడదీయరాని బంధం ఉంది. పండగలు పర్వదినాలు, శుభకార్యాలకు పసిడి కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ధన్ తేరాస్ రోజున బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో దీపావళి పండుగకు ముందు మగువలకు ఆనందం కలిగించేలా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. భారత్‌లో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. ధన్వంతరి జయంతి లేదా ధన్‌తేరస్ పండుగ రోజు బంగారం కొనుగోలు చేసే వారికి ఇది శుభవార్త. భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా బంగారం ధర తగ్గింది. భారతదేశంలో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,700 రూపాయలుండగా 24 క్యారెట్స్ పసిడి ధర రూ.60,760. లు ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలతో పాటు దేశంలో ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
హైదరాబాద్ లో ఈ రోజు (నవంబర్ 10 నాటికి) బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 5,570లు ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర: రూ.55,700గా ఉంది.
24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6,076లు ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర: రూ.60,760లు గా ఉంది. ఇదే ధరలు తెలుగురాష్ట్రాల్లో ముఖ్యనగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్ లో కొనసాగుతున్నాయి.
వివిధ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములకు). బెంగళూరు: రూ. 55,700 చెన్నై: రూ. 56,150 ముంబై: రూ. 55,700 ఢిల్లీ: రూ. 55,850 కోల్‌కతా: రూ. 55,700 కేరళ: రూ. 55,700 అహ్మదాబాద్: రూ. 55,750 జైపూర్: రూ. 55,850 లక్నో: రూ. 55,850 భువనేశ్వర్: రూ. 55,750
వెండి ధరలు
బంగారం తర్వాత ఎక్కువగా కొనుగోలు చేసే లోహం వెండి. పూజలు, శుభకార్యాలు వంటి సమయాల్లో వెండి వస్తువుల వినియోగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఇపుడు వెండి తో పూజా సామాగ్రి, దేవతల విగ్రహాలు, పట్టీలు, మెట్టెలు వంటివి మాత్రమే కాదు ఆభరణాలుగా కూడా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వెండి లోహానికి కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నవంబర్ 10 వ తేదీన హైదరాబాద్ లో నిన్నటి నుంచి రూ. 300 లు తగ్గి నేడు రూ. 76,200లుగా కొనసాగుతోంది. ఇదే ధర విజయవాడ, విశాఖ పట్నంలో కూడా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కేజీ వెండి ధర 73,200 లుగా కొనసాగుతోంది.
దేశంలో వివిధ నగరాల్లో వెండి ధర (100 గ్రాములకు).
బెంగళూరు: రూ.7,250 చెన్నై: రూ. 7,620 ముంబై: రూ. 7,320 ఢిల్లీ: రూ. 7,320 కోల్‌కతా: రూ. 7,320 కేరళ: రూ. 7,620 అహ్మదాబాద్: రూ. 7,320 జైపూర్: రూ. 7,320 లక్నో: రూ. 7,320 భువనేశ్వర్: రూ. 7,620
అమెరికాలో బ్యాంకు వడ్డీ రేటు పెరగవచ్చన్న భయంతో బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణమైంది. నిపుణుల అంచనాల ప్రకారం బంగారం ధర ఇప్పుడు తగ్గుతోంది. అయితే రాబోయే రోజుల్లో ఇది మళ్లీ పెరుగుతుంది. వచ్చే ఏడాది బంగారం ధర రూ.70,000 దాటే అవకాశం ఉందని చెబుతున్నారు.
( గమనిక: ఇక్కడ ఇవ్వబడిన బంగారం, వెండి ధరలు ఖచ్చితమైనవని హామీ ఇవ్వలేము. ఇది ప్రముఖ ఆభరణాల నుండి సేకరించిన సమాచారం. అలాగే, ఈ ధరలు GST, మేకింగ్ ఛార్జీలు మొదలైన వాటికి లోబడి బంగారం వస్తువుల ధరలు ఉండవచ్చు.)
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..