Dhanteras 2022: నేడు ధన్ తేరాస్.. ఏ దేవతలను పూజిస్తే.. ఏ విధమైన ఫలితం ఉంటుందంటే..
ఈ రోజు ధన్‌తేరస్ పండుగను జరుపుకోబోతున్నట్లయితే ముందుగా ధన్‌తేరస్ రోజున ఏ దేవుడిని పూజించాలో ఎలా పూజిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసుకోండి. ధన్‌తేరాస్‌లో పూజించే శుభ సమయం సాయంత్రం 5.45 నుండి ప్రారంభమై రాత్రి 7.42 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో లక్ష్మిదేవి, గణపతి, కుబేరుడు, ధన్వంతరి దేవుడిని పూజించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు, సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్మకం.

హిందూ మతంలో ధన్ తేరాస్ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం త్రయోదశి రోజున జరుపుకుంటారు. ఈ పండుగ 5 రోజుల పాటు జరుపుకునే దీపావళి పండుగలో మొదటి రోజు. ఈ ఐదు రోజులలో ఐదుగురు దేవుళ్లను పూజిస్తారు. హిందూ మత విశ్వాసం ప్రకారం దీపావళి పండుగ ధన్‌తేరస్ నుంచి ప్రారంభమై అన్నా చెల్లెళ్ల పండగలో ముగుస్తుంది. హిందూ విశ్వాసాల ప్రకారం ధన్‌తేరస్ రోజున బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ రోజు షాపింగ్ చేయడానికి అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు నుంచి దీపావళి వేడుకలు జరుపుకోవడం మొదలు పెడతారు.
ఈ రోజు ధన్‌తేరస్ పండుగను జరుపుకోబోతున్నట్లయితే ముందుగా ధన్‌తేరస్ రోజున ఏ దేవుడిని పూజించాలో ఎలా పూజిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసుకోండి. ధన్‌తేరాస్‌లో పూజించే శుభ సమయం సాయంత్రం 5.45 నుండి ప్రారంభమై రాత్రి 7.42 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో లక్ష్మిదేవి, గణపతి, కుబేరుడు, ధన్వంతరి దేవుడిని పూజించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు, సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్మకం.
ధన్వంతరి పూజ ధన్ తేరస్ రోజున ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి సముద్ర మథనం నుండి అమృత పాత్రతో ప్రత్యక్షమయ్యాడు. అమృత కలశంలోని అమృతాన్ని సేవించి దేవతలు అమరులయ్యారు. అందుకే ధన్వంతరిని దీర్ఘాయువు, ఆరోగ్యం కోసం ధన్‌తేరస్‌లో పూజిస్తారు.
లక్ష్మీ పూజ ఈ రోజున లక్ష్మీ దేవిపూజకు కూడా ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీ దేవి భయం, దుఃఖం నుండి విముక్తి చేస్తుంది. ధన ధాన్యాలు, ఇతర సౌకర్యాలను అందించడం ద్వారా వ్యక్తికి ఆరోగ్యవంతమైన శరీరాన్ని దీర్ఘాయువును ఇస్తుందని శ్రీ సూక్తంలో వివరించబడింది.
కుబేర పూజ ఈ రోజున సంపదలకు దేవుడు అయిన కుబేరుని ప్రత్యేకంగా పూజిస్తారు. కుబేరుడు కూడా రాక్షస ప్రవృత్తిని తొలగించే దేవుడు.. అందుకే కుబేరుడి ఆరాధన కూడా ప్రజాదరణ పొందింది.
యమ పూజ ధన్ తేరస్ రోజున యమ పూజకు కూడా ప్రాముఖ్యత ఉంది. నేడు యమ ధర్మ రాజు కోసం దీపదానం చేస్తే అకాల మరణం ఉండదని చెబుతారు.
గణేష్ పూజ గణేశుడు ప్రతి శుభ కార్యంలో , పండుగలో పూజించబడతాడు. ఎందుకంటే గణపతి మొదటి పూజను అందుకుంటాడు. కనుక ఏ దేవి దేవతలను పూజించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం తప్పనిసరి.
పశువుల పూజ ధన్ తేరస్ రోజున.. గ్రామీణ ప్రాంతాల్లో పశువులను అందంగా అలంకరించి పూజిస్తారు. ఎందుకంటే గ్రామస్తుల జీవితంలో పశువులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ప్రజలు ఆవులను లక్ష్మీ దేవి అవతారంగా భావిస్తారు. అందుకే అక్కడి ప్రజలు ఆవులకు ప్రత్యేక గౌరవం ఇస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు