AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold vs Silver: ప్రజెంట్‌ కేజీ వెండితో ఎంత బంగారం కొనవచ్చు.. దేనిపై ఇన్వెస్ట్ చేయడం బెస్ట్!

మన దేశంలో బంగారం, వెండి కేవలం ఆభరణాలుగా మాత్రమే కాదు.. చాలా మంది వీటిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ రెండు లోహాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక్కడ చర్చించుకోదగ్గ విషయం ఏమిటంటే.. బంగారంతో పోల్చుకుంటే వెండి చాలా స్పీడ్‌గా పెరిగింది. దీంతో వెండితో బంగారాన్నే కొనచ్చనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో కేజీ వెండితో ఎంత బంగారం కొనొచ్చో తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Jan 30, 2026 | 7:00 AM

Share
రోజూరోజుకూ బంగారం కంటే స్పీడ్‌గా వెండి ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 1 కిలో వెండి ధర రూ.3,70,340  కేవలం రెండు రోజుల్లోనే వెండి ధర రూ.40 వేలకు పైగా పెరిగింది. జనవరి 1 నుండి నేటి వరకు వెండి ధర దాదాపు రూ.1.30 లక్షలుపైగా పెరిగింది. డిసెంబర్ 31, 2025న ఒక కిలో వెండి దాదాపు రూ.2.30 లక్షలుగా ఉంగా ఇది  ఇప్పుడు రికార్డు స్థాయిలో ట్రెడ్ అవుతుంది.

1 / 6
ఈరోజు బంగారం ధర చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,78,885 వద్ద కొనసాగుతుంది. జనవరి నెలలో కేవలం 29 రోజుల్లోనే బంగారం ధర రూ.40,000 కంటే ఎక్కువ పెరిగింది. గత సంవత్సరం చివరి నాటికి, అంటే డిసెంబర్ 31, 2025న, 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.1.33లుగా ఉంటే ఇప్పుడు ఏకంటా లక్షా 70 వేలకు చేరింది. దీన్ని బట్టి చూస్తే బంగారం డిమాండ్ ఎంత పెరిగిందో స్పష్టమవుతుంది.

2 / 6
ఈ క్రమంలో మీరు 1 కిలో వెండితో ఎంత బంగారం కొనవచ్చు? అనే విషయానికి వస్తే.. ప్రస్తుత ధరలను భట్టి మీరు 1 కిలో వెండిని అమ్మితే, మీకు రూ. 3,70,000 వరకు వస్తాయి. అదే సమయంలో, 10 గ్రాముల బంగారం ధర రూ. 1,78,850గా ఉంది. ఈ లెక్క ప్రకారం, మీరు 1 కిలో వెండితో దాదాపు 22 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. నార్మల్‌గా చెప్పాలంటే మీ దగ్గర కేజీ వెండి ఉంటే.. 22 గ్రాముల బంగారం ఉన్నట్టు లెక్క

3 / 6
బంగారం ధర ఎందుకు పెరుగుతుంది: రోజురోజుకూ బంగారం ధరలు పసిడిప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం ఏంటనే విషయానికి వస్తే.. ప్రపంచ రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను బంగారం వైపు ఆకర్షిస్తున్నాయి. దీంతో పాటు రూపాయి విలువ తగ్గడం దేశీయ మార్కెట్లో బంగారం ధరను మరింత పెంచుతుంది. అదనంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుతున్నాయి, ఇది కూడా బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అంటున్నారు విశ్లేషకులు.

4 / 6
 ఇక వెండి విషయానికి వస్తే.. ఎలక్ట్రానిక్స్, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ వాహనాలలో వెండి వాడకం రోజురోజుకూ పెరిగిపోతుంది. దీని వల్ల వెండికి డిమాండ్ కూడా పెరిగింది. అమెరికా సహా చాలా దేశాల కంపెనీలు పెద్ద మొత్తంలో వెండిని నిల్వ చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఉత్పత్తి తగ్గుతుందనే భయంతో పెట్టుబడిదారులు ముందుగానే వెండిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో వెండి ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి.

5 / 6
దేనిపై ఇన్వెస్ట్ చేయడం బెస్ట్: బంగారం, వెండి రెండూ వేర్వేరు ప్రయోజనాల కోసం తగిన పెట్టుబడి ఎంపికలు. సాధారణంగా బంగారాన్ని సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడిగా చాలా మంది భావిస్తారు. కానీ ప్రస్తుతం వెండి పారిశ్రామిక వినియోగంలో పెరుగుతున్న కారణంగా రాబోయే రోజుల్లో వెండి అధిక రాబడిని ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్ అస్థిరత, ప్రపంచ పరిస్థితులు, సరఫరా-డిమాండ్ సమీకరణాల దృష్ట్యా, పెట్టుబడిదారులు వారి అవసరాలు,  లక్ష్యాల ప్రకారం బంగారం లేదా వెండిని ఎంచుకోవడం మంచిదని చెబుతున్నారు.

6 / 6