AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: భర్తకు ముచ్చటగా మూడో పెళ్లి.. శుభలేఖలు పంచిపెట్టిన ఇద్దరు భార్యలు

ఎటువంటి పొరబచ్చాలు లేకుండా భార్యతో సంసారం చక్కగా సాగిపోతే చాలు అని ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు. అయితే అల్లూరి జిల్లాలో ఓ వ్యక్తి ఏకంగా మూడు వివాహాలు చేసుకున్నాడు. మూడో పెళ్లికి.. మొదటి భార్య, రెండవ భార్య పెద్దలు వ్యవహరించడం గమనార్హం. డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

AP News: భర్తకు ముచ్చటగా మూడో పెళ్లి.. శుభలేఖలు పంచిపెట్టిన ఇద్దరు భార్యలు
Third Marraige
Maqdood Husain Khaja
| Edited By: Ram Naramaneni|

Updated on: Jun 30, 2024 | 4:21 PM

Share

అందరితో కలిసిపోయి.. అణుకువగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుని… భార్యాబిడ్డలతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని చాలామంది అబ్బాయిలు కోరకుంటారు. తమను అర్థం చేసుకునే అమ్మాయి రావాలని దేవుళ్లకు మొక్కుకుంటూ ఉంటారు. కానీ కొందరు రిస్కీ ఫెల్లోస్ ఒకరికి తెలియకుండా.. మరొకర్ని పెళ్లి చేసుకుని ఇద్దర్నీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాకపోతే.. ఎప్పుడైనా విషయం బయటపడితే ఆ భర్త కొంప కొల్లేరే..!

ఒక భార్యనే మోయడం కష్టం అనుకుంటున్నారు ఇప్పటి జనరేషన్‌లో కొందరు కుర్రాళ్లు.. కానీ అల్లూరి జిల్లాలో అయితే ఇద్దరు భార్యలతో ఎంచక్కా సంసారం సాగించే ఓ భర్త.. ఇప్పుడు ముచ్చటగా మూడో భార్యను పెళ్లి చేసుకున్నాడు. అది కూడా అఫీషియల్‌గానే.. అందుకు అప్పటికే ఉన్న ఇద్దరు భార్యలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతేనా.. వారిద్దరూ పెళ్లి పెద్దల్లా మారి అన్ని తామై చూసుకున్నారు. హ్యాపీగా బంధుమిత్రులను ఆహ్వానించారు. మా భర్తకు మూడో పెళ్లికి అందరూ వచ్చి ఆశీర్వదించాలని శుభలేఖలు కూడా పంచారు. మీ నిండు మనసుతో ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించ ప్రార్థన అంటూ ప్రతి ఒక్కరి గడపకు వెళ్లి… పెళ్లి కార్డు ఇచ్చి మరి ఆహ్వానం పలికారు. ఇంతకీ ఇద్దరి భార్యల సమ్మతితో మూడో భార్యను సొంతం చేసుకున్న ఆ లక్కీయస్ట్ ఫెలో ఎవరో తెలుసుకోవాలని మీకు ఉందా.. పదండి డీటేల్స్‌లోకి వెళ్తాం.

అది అల్లూరి జిల్లా ఏజెన్సీలోని పెదబయలు మండలం గుల్లెలు పంచాయితీ కించూరు గ్రామం. అక్కడ సాగేని పండన్న.. పార్వతమ్మను తొలుత వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు అప్పలమ్మను కూడా మొదటి భార్య అంగీకారంతో పెళ్లాడాడు. అలా ఇద్దరు భార్యలతో పండన్న సంసార జీవితం సాఫీగానే సాగిపోతుంది. ఏనాడు ఎటువంటి కుటుంబ కలహాలు లేకుం..డా ఆ ఇద్దరు భార్యలు భర్తను చక్కగా చూసుకుంటున్నారు. అయితే.. అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్న పండన్న.. లక్ష్మీ అనే మరో యువతిపై మనసు పారేసుకున్నాడు. ఆమెది జి మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ బందవీధి గ్రామం. లక్ష్మీని ఇష్టపడ్డ విషయం .. తనను ఎంతగా ప్రేమించే ఇద్దరు భార్యలకు చెప్పాడు. దీంతో తన భర్త ఆనందంలో తమ ఆనందం చూసుకునే ఆ ఇద్దరు భార్యలు పండన్నను ప్రోత్సహించారు.

ఆ ఇద్దరు భార్యలే స్వయంగా..

దీంతో ఇక పండన్న వెనక్కి తగ్గలేదు. ఎలాగైనా ఆమెను వివాహం చేసుకొని తమ జీవితంలోకి ఆహ్వానించాలని అనుకున్నాడు. అంతే.. ఆ ఇద్దరు భార్యలతో రాయభారం పంపాడు. పెద్దలు కూడా అంగీకరించడంతో.. లక్ష్మీని పండన్నకు ఇచ్చి వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక.. ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.

ఇంటింటికి వెళ్లి.. ఆహ్వానాలు అందించి..

పండన్నకు తల్లిదండ్రులు లేరు.. దీంతో ఇద్దరు భార్యలే అతనికి సర్వస్వం. వాళ్లు కూడా అదే స్థాయిలో పండన్నను ప్రాణానికి మించి చూసుకుంటున్నారు. ఇక పెళ్లి పెద్దలు కూడా వాళ్ళిద్దరే అయ్యారు. శుభలేఖల్లో కూడా..  ఆ ఇద్దరు భార్యలే అందరిని ఆహ్వానిస్తున్నట్టు ముద్రించారు. ఇంటింటికి వెళ్లి శుభలేఖలను పంచారు. బంధుమిత్రులను ఆహ్వానించారు. ‘మీ రాకను ప్రేమతో ఆహ్వానిస్తూ.. నిండు మనసుతో ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించ ప్రార్థన.. అంటూ ఆ ఇద్దరు భార్యలు సాగేని పార్వతమ్మ, సాగేని అప్పలమ్మ..’ అంటూ శుభలేఖను ముద్రించి ముగించారు.

సందడిగా విందు.. వినోదం

జూన్ 25 ఉదయం 10 గంటలకు కించూరులో వివాహం జరిగింది. నవవధువు లక్ష్మీ తరపు బంధువులు, మూడో పెళ్లి చేసుకుంటున్న పండన్న బంధుమిత్రులు, గ్రామ పెద్దలు కూడా వివాహానికి హాజరయ్యారు. అదే స్థాయిలో విందు కూడా ఏర్పాటు చేశారు. అందరూ కలిసి గ్రాండ్‌గా పండన్న లక్ష్మీల వివాహాన్ని జరిపించారు. సంసారం సుఖసంతోషాలతో సాగిపోవాలని ఆశీర్వదించారు. ఇదండీ ఇద్దరు భార్యల చేతుల మీదుగా ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్ పండన్న వివాహ వేడుక విశేషాలు. నిజంగా ఎంత లక్కీ యెస్ట్ ఫెల్లో గురూ నువ్వు అంటూ కామెంట్స్ పెడుతన్నారు ఈ విషయం తెలిసిన నెటిజన్లు.

Wedding Card

Wedding Card

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…