విశేష సేవలందించిన హెలికాప్టర్‌కు వీడ్కోలు.. ఎంత గొప్పగా చేశారంటే..

భారత నౌకాదళంలో 17 సంవత్సరాల పాటు అద్భుతమైన సేవలు అందించిన UH-3H హెలికాప్టర్‌కు భారత నావికాదళం ఘనంగా వీడ్కోలు పలికింది. ఇందుకోసం ఏకంగా విశాఖలోని నౌకా విమానాశ్రయం INS డేగాలో జరిగిన డి-ఇండక్షన్ పేరుతో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ స్టాఫ్ అడ్మిరల్ సమీర్ సక్సేనా అధ్యక్షత వహించారు. UH3H స్క్వాడ్రన్‌లోని సేవలు అందించిన అనుభవజ్ఞులైన అధికారులు, సిబ్బంది హెలికాప్టర్ అద్భుతమైన సేవలను గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులతో ఈవెంట్‌ను తిలకించారు.

విశేష సేవలందించిన హెలికాప్టర్‌కు వీడ్కోలు.. ఎంత గొప్పగా చేశారంటే..
Visakhapatnam
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 30, 2024 | 4:42 PM

భారత నౌకాదళంలో 17 సంవత్సరాల పాటు అద్భుతమైన సేవలు అందించిన UH-3H హెలికాప్టర్‌కు భారత నావికాదళం ఘనంగా వీడ్కోలు పలికింది. ఇందుకోసం ఏకంగా విశాఖలోని నౌకా విమానాశ్రయం INS డేగాలో జరిగిన డి-ఇండక్షన్ పేరుతో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ స్టాఫ్ అడ్మిరల్ సమీర్ సక్సేనా అధ్యక్షత వహించారు. UH3H స్క్వాడ్రన్‌లోని సేవలు అందించిన అనుభవజ్ఞులైన అధికారులు, సిబ్బంది హెలికాప్టర్ అద్భుతమైన సేవలను గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులతో ఈవెంట్‌ను తిలకించారు.

మానవ విపత్తు సహాయ చర్యలలో..

INS జలశ్వతో పాటు 2007లో భారతదేశ తీరాలకు తీసుకురాబడిన UH-3H హెలికాప్టర్ 24 మార్చి 2009న విశాఖపట్నంలోని INS డేగా వద్ద INAS 350 ‘సారస్’గా నామకరణం చేయబడింది. ఈ బహుముఖ హెలికాప్టర్ మానవతా సహాయంతోపాటూ విపత్తు సహాయ చర్యలలో కీలక పాత్ర పోషించింది ఈ సాయుధ UH-3H హెలికాప్టర్‌. ప్రకృతి వైపరీత్యాల సమయంలో 17 ఏళ్లుగా ఈ హెలికాప్టర్ అందించిన సేవలు నిరూపమానం. అంతటి వెలకట్టలేని సేవలు అందించిన ఈ యుద్ద హెలికాప్టర్‎కు భారత నావికాదళం శుక్రవారం విరమణను ప్రకటించింది.

UH-3H స్థానంలో సీ కింగ్ 42C హెలికాప్టర్..

కాల మాన పరిస్థితులకు అనుగుణంగా అద్భుతమైన సేవలు అందించిన UH-3H హెలికాప్టర్‎కు సేవలు అందించే గడువు ముగిసింది. తాజాగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాలంటే మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన హెలికాప్టర్‎లు అవసరం. అందుకే ఈ UH-3H స్థానంలో సీ కింగ్ 42C హెలికాప్టర్ INAS 350 లో కొనసాగుతుంది. అందుకు అనుగుణమైన కార్యాచరణ శక్తి సామర్థ్యాన్ని సీకింగ్ 42C కలిగి ఉందని ఈస్ట్ కోస్ట్ నేవీ తెలిపింది. UH-3H హెలికాప్టర్ డి-ఇండక్షన్ వేడుక ద్వారా ప్రత్యేక కార్యకలాపాలు, శోధన, రెస్క్యూ (SAR) మిషన్లలో వినూత్న సామర్థ్యాలను ప్రవేశపెట్టిన అద్భుతమైన శకానికి ముగింపు పలికినట్టే అన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు. నిరంతరం మార్పు చెందుతున్న సముద్ర వాతావరణ మార్పులకు అనుగుణంగా UH-3H కార్యాచరణ పాత్ర భారత నౌకాదళ విమానయాన చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని ఇండియన్ నేవీ ప్రశంసించింది.

విశాఖపట్నంలో ప్రదర్శనగా కొలువు..

శక్తివంతమైన ‘సారస్’ స్క్వాడ్రన్ శిఖరాన్ని “బలం, శౌర్యం, పట్టుదల” అనే మూడు లక్షణాలు మేళవించి ఉన్నట్లు తెలిపారు అధికారులు. భారత వైమానిక దళంలో 17 ఏళ్ల పాటు క్రియాశీలకంగా సేవలు అందించిన UH- 3H హెలికాప్టర్ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందన్న అభిప్రాయాన్ని ఇండియన్ నేవీ వ్యక్తం చేసింది. నిరంతరం అప్రమత్తమైన నిఘాను నిర్వహిస్తూ, అచంచలమైన అంకితభావంతో మన దేశ సముద్ర సరిహద్దుల భద్రతను కాపాడిన ఈ హెలికాప్టర్ సేవా జీవితం ముగిసిందని తెలిపారు. అయితే UH-3H హెలికాఫ్టర్‎ను భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖలోని ప్రముఖ ప్రదేశంలో శాశ్వతంగా ప్రదర్శించబడుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఈఎన్‌సీ రాష్ట్ర ప్రభుత్వానికి స్మారక ఫలకాన్ని అందజేశారు. విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ ఈ శిలా ఫలకాన్ని అందుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గెట్ రెడీ పర్ కేబినెట్ ఎవరెవరికి ఛాన్స్ అంటే..!
గెట్ రెడీ పర్ కేబినెట్ ఎవరెవరికి ఛాన్స్ అంటే..!
జామ చెట్టు ఆకులను ఇలా వాడారంటే షుగర్, బీపీకి బైబై చెప్పొచ్చు..
జామ చెట్టు ఆకులను ఇలా వాడారంటే షుగర్, బీపీకి బైబై చెప్పొచ్చు..
ఇండస్ట్రీలోకి వచ్చి 8 ఏళ్లైనా లిప్ లాక్ సీన్ చేయని హీరోయిన్..
ఇండస్ట్రీలోకి వచ్చి 8 ఏళ్లైనా లిప్ లాక్ సీన్ చేయని హీరోయిన్..
ఫ్లిప్‌కార్ట్‌లో ఊహకందని ఆఫర్స్‌.. స్మార్ట్‌ ఫోన్స్‌పై
ఫ్లిప్‌కార్ట్‌లో ఊహకందని ఆఫర్స్‌.. స్మార్ట్‌ ఫోన్స్‌పై
'ఇలాంటి భార్య ఎవరికీ ఉండకూడదు'..హార్దిక్ సతీమణిపై అభిమానుల ఆగ్రహం
'ఇలాంటి భార్య ఎవరికీ ఉండకూడదు'..హార్దిక్ సతీమణిపై అభిమానుల ఆగ్రహం
రేపట్నుంచి టెట్‌ (జులై) ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..
రేపట్నుంచి టెట్‌ (జులై) ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..
మేనమామను హతమార్చిన మైనర్.. విషయం తెలిసి షాక్..!
మేనమామను హతమార్చిన మైనర్.. విషయం తెలిసి షాక్..!
చెమటలు ఎక్కువగా పడితే బరువు తగ్గుతారా.. అసలు విషయం ఇదే!
చెమటలు ఎక్కువగా పడితే బరువు తగ్గుతారా.. అసలు విషయం ఇదే!
ఇద్దరి మధ్య అసూయ లేదు.. కలిసి సినిమా అందుకే చేయలేదు.. కమల్.
ఇద్దరి మధ్య అసూయ లేదు.. కలిసి సినిమా అందుకే చేయలేదు.. కమల్.
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్