డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ఆ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్..

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జూలై ఒకటి నుంచి మూడు రోజులు పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించి మంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా జిల్లాకు విచ్చేయనున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనపై ఆ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం పర్యటన చేసే ప్రాంతాలను పరిశీలించింది.

డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ఆ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్..
Deputy Cm Pawankalyan
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 30, 2024 | 5:10 PM

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జూలై ఒకటి నుంచి మూడు రోజులు పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించి మంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా జిల్లాకు విచ్చేయనున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనపై ఆ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం పర్యటన చేసే ప్రాంతాలను పరిశీలించింది. జులై 1న సోమవారం ఉదయం మంగళగిరి నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుండి పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలుకు వెళ్లనున్నారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు సత్యకృష్ణ కన్వెన్షన్ హాలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం చేబ్రోలులో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు, జనసైనికులతో సమీక్ష నిర్వహిస్తారు.

జులై 2న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్‎లో పంచాయతీరాజ్ శాఖ, జలవనరుల శాఖ, అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. అలాగే రహదారుల పరిస్థితిపై కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం చేబ్రోలులో జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. జూలై 3న ఉదయం 10 గంటలకు ఉప్పాడలో సముద్ర కోతతో దెబ్బతిన్న ప్రాంతాలు పరిశీలిస్తారు. మధ్యాహ్నం పిఠాపురం అధికారులతో పరిచయం, తెదేపా- భాజపా నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిపించినందుకు సాయంత్రం 4 గంటలకు వారాహి బహిరంగ సభ ద్వారా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రసంగించనున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే ఛలో పిఠాపురం అనే నినాదంతో భారీ స్థాయిలో అక్కడకు చేరుకుంటున్నారు. ఆయన పిఠాపురంలో నివసిస్తున్న ఇంటిని ఇప్పటికే భారీ కటౌట్లతో బెలూన్లతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే రెండు రోజుల నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో పర్యటిస్తున్నారు. అక్రమ రేషన్ బియ్యాన్ని పోర్టుల ద్వారా తరలిస్తున్నారు అంటూ వచ్చిన ఆరోపణలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..