JEE Advanced 8th Rankers: జేఈఈలో 8వ ర్యాంక్‌ సాధించిన విజయవాడ కుర్రోడికి రూ.1.60 కోట్ల నగదు బహుమతి

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 పరీక్ష ఫలితాలు జూన్‌ 9వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. విజయవాడ ఫిట్జి కాలేజీకి చెందిన విద్యార్థి కోడూరు తేజేశ్వర్‌ జేఈఈ అడ్వాన్స్‌ ఫలితాల్లో ఓపెన్‌ కేటగిరీలో ఆలిండియా 8వ ర్యాంకు సాధించాడు. దీంతో ఫిజ్జీ కాలేజ్‌ యాజమన్యం తేజేశ్వర్‌ను ఘనంగా సన్మానించింది...

JEE Advanced 8th Rankers: జేఈఈలో 8వ ర్యాంక్‌ సాధించిన విజయవాడ కుర్రోడికి రూ.1.60 కోట్ల నగదు బహుమతి
JEE-Advanced-8th-Ranker
Follow us

|

Updated on: Jun 30, 2024 | 4:40 PM

విజయవాడ, జూన్‌ 30: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 పరీక్ష ఫలితాలు జూన్‌ 9వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. విజయవాడ ఫిట్జి కాలేజీకి చెందిన విద్యార్థి కోడూరు తేజేశ్వర్‌ జేఈఈ అడ్వాన్స్‌ ఫలితాల్లో ఓపెన్‌ కేటగిరీలో ఆలిండియా 8వ ర్యాంకు సాధించాడు. దీంతో ఫిజ్జీ కాలేజ్‌ యాజమన్యం తేజేశ్వర్‌ను ఘనంగా సన్మానించింది. ఏకంగా రూ.1.60 కోట్ల నగదు పురస్కారాన్ని తేజేశ్వర్‌కు ప్రకటించింది. జూన్‌ 29న కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఏఎస్‌ అధికారి ప్రద్యుమ్న చేతుల మీదగా విద్యార్ధి తేజేశ్వర్‌కు చెక్కును అందించారు.

అదే కాలేజీలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన ఇతర విద్యార్థులకు సైతం నగదు పురస్కారాలు అందించారు. సాయి కార్తీక్‌కు రూ.16 లక్షలు చెక్కు అందించారు. అలాగే పవన్‌ సాయి సుభాష్‌కు రూ.14 లక్షలు, పవన్‌ చంద్రకు రూ.5 లక్షలు, కామేశ్వరరావుకు రూ.5 లక్షలు, విశాల్‌రెడ్డికి రూ.2 లక్షలు, సత్యనారాయణ సాకేత్, విష్ణువర్ధన్‌రెడ్డి, సాయి లోకేష్, గణేష్‌లకు రూ. లక్ష చొప్పున నగదు బహుమతులను అందజేశారు. కాలేజీ డైరెక్టర్‌ పిన్నెపు రమేష్‌బాబు, అధ్యాపకులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్ధులను ఘనంగా సత్కరించారు.

జులై 4 నుంచి టీజీపీఎస్సీ వెటర్నరీ అసిస్టెంట్‌ ధ్రువీకరణ పత్రాల పరిశీలన..

తెలంగాణ పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్‌ క్లాస్‌ ఏ, బీ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేసిన టీజీపీఎస్సీ జులై 3 నుంచి ఆన్‌లైన్‌లో వెబ్‌ ఆప్షన్లు నమోదుకు అవకాశం ఇచ్చింది. ఇక జులై 4 నుంచి 8 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్‌ నికోలస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్‌సర్వీస్‌ ఆఫీస్‌లో జులై 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆయా తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్లను తమతోపాటు తెచ్చుకోవాలని కమిషన్‌ సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.