AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP RGUKT IIIT 2024 Admissions: జులై 1 నుంచి నూజివీడు క్యాంపస్‌లో ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు ధ్రువపత్రాల పరిశీలన.. స్పెషల్ కేటగిరీ జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఏపీలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీ కాలేజీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. మే 8 నుంచి జూన్‌ 25 వరకు స్వీకరించిన ఆన్‌లైన్‌ దరఖాస్తులకు సంబంధించి స్పెషల్‌ కేటగిరీ ధ్రవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదలైంది..

AP RGUKT IIIT 2024 Admissions: జులై 1 నుంచి నూజివీడు క్యాంపస్‌లో ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు ధ్రువపత్రాల పరిశీలన.. స్పెషల్ కేటగిరీ జాబితా విడుదల
AP RGUKT IIIT Admissions
Srilakshmi C
|

Updated on: Jun 30, 2024 | 3:25 PM

Share

అమరావతి, జూన్‌ 30: ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఏపీలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీ కాలేజీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. మే 8 నుంచి జూన్‌ 25 వరకు స్వీకరించిన ఆన్‌లైన్‌ దరఖాస్తులకు సంబంధించి స్పెషల్‌ కేటగిరీ ధ్రవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదలైంది. వీరందరికీ జులై 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నూజివీడు క్యాంపస్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. క్యాప్‌, స్పోర్ట్స్‌, బీఎస్‌జీ, పీహెచ్‌, ఎన్‌సీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావాల్సి ఉంటుంది. జులై 11న క్యాంపస్‌ల వారీగా ఎంపికైన విద్యార్థుల తుది జాబితా విడుదలవుతుంది. సీట్ల కేటాయింపు తర్వాత జులై మూడో వారం నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.

ఏపీ ట్రిపుల్‌ ఐటీ ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

జులై 1 నుంచి టీజీపీఎస్సీ ఏఎంవీఐ పోస్టులకు వైద్య పరీక్షలు.. వెబ్‌సైట్లో అభ్యర్థుల జాబితా

తెలంగాణ రావాణా శాఖలోని అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి వైద్య పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. ఎంపికైన అభ్యర్థులకు జులై 1 నుంచి 8వ తేదీ వరకు మెడికల్‌ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. ఈ మేరకు అభ్యర్థులు తమ వివరాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని ఉస్మానియా సర్వజన ఆసుపత్రిలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్‌ వెల్లడించింది. కాగా అభ్యర్ధులకు జూన్ 12, 13 తేదీల్లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా మొత్తం 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

టీజీపీఎస్సీ ఏఎంవీఐ 2024 నియామక వైద్య పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్