ఏపీలో చోరీకి గురైన బైక్‌లు ఒడిశాలో ప్రత్యక్షం..! ఆ రాష్ట్రంలోనే ఎందుకు ఉంటున్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

LLUERI అసలేం జరిగిందంటే.. అల్లూరి ఏజెన్సీ కొయ్యూరులో బైక్‌ను పోగొట్టుకున్న రామాంజనేయులు అనే ఓ బాధితుడు.. కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. ఆగస్టులో చోరీ జరిగితే.. వెతికి వెతికి మరీ చోరీకి గురైన 20 రోజుల తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు ఆలస్యమైనా.. పోలీసులు మాత్రం వెంటనే పని ప్రారంభించేశారు. 

ఏపీలో చోరీకి గురైన బైక్‌లు ఒడిశాలో ప్రత్యక్షం..! ఆ రాష్ట్రంలోనే ఎందుకు ఉంటున్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Stolen Bikes
Follow us
Maqdood Husain Khaja

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Sep 21, 2023 | 2:22 PM

అల్లూరి సీతారామరాజు జిల్లా, సెప్టెంబర్ 21: అల్లూరి ఏజెన్సీలో గత కొంతకాలంగా బైక్లు కనిపించకుండా పోతున్నాయి. ఒక్కో చోట నుంచి బైక్లు మాయం అయిపోతున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయో ఎలా పోతున్నాయో కూడా ఎవరికీ అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. పోలీసులు కూపి లాగితే ఓ లింకు దొరికింది.. కట్ చేస్తే బైకులన్నీ బోర్డర్ దాటిపోయాయని తెలిసి, అంతా అవాక్కయ్యారు. ఇక్కడ బైక్‌లు బోర్డర్ ఎలా దాటుతున్నాయని పూర్తి విచారణ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే.. అల్లూరి ఏజెన్సీ కొయ్యూరులో బైక్‌ను పోగొట్టుకున్న రామాంజనేయులు అనే ఓ బాధితుడు.. కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. ఆగస్టులో చోరీ జరిగితే.. వెతికి వెతికి మరీ చోరీకి గురైన 20 రోజుల తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు ఆలస్యమైనా.. పోలీసులు మాత్రం వెంటనే పని ప్రారంభించేశారు.

తీగలాగితే..

కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ చేస్తుండగా పోలీసులకు ఒక బైక్‌పై ఇద్దరూ అనుమానాస్పదంగా కనిపించారు. ప్రశ్నిస్తే.. పొంతన లేని సమాధానాలను పోలీసులకు చెప్పారు. అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని.. వారిని తమదైన స్టైల్లో విచారించే సరికి ఇద్దరూ అసలు విషయం చెప్తామంటూ నోరు విప్పారు. తాము బైకులను చోరీలు చేసి సన్యాసి రావు అనే వ్యక్తికి అప్పగిస్తున్నామని చెప్పుకొచ్చారు. దీంతో పోలీసులు.. వంతల సొమరాజు,అకేటి దుర్గా ప్రసాద్, పాంగి సన్యాసిరావు, వంతల నాగేంద్రలను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఇక్కడ దొంగిలించిన బైకులను ఒడిశాకు తీసుకెళ్తున్నట్లుగా అసలు విషయం బయటపడింది.

ఇవి కూడా చదవండి

ఒడిశాలో ఎందుకంటే..

మైదానం, ఏజెన్సీ ప్రాంతాల్లో బైకులు దొంగతనం చేయడం హాబిగా చేసుకుని వాటిని ఏజెన్సీలో ఉన్న పాంగ సన్యాసి రావు అనే వ్యక్తికి అప్పజెప్పుతున్నారు సోమరాజు, దుర్గ ప్రసాద్. వాటిని నాగేంద్ర అనే మరో వ్యక్తి సహకారంతో బోర్డర్ దాటించి ఒడిశాకు తరలించేస్తున్నాడు సన్ని బాబు. అక్కడ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఒడిస్సాకే ఎందుకంటే.. ఆంధ్రలో దొంగతనం చేసిన బైకులు ఒడిశా వాళ్లకు అమ్మితే ఎటువంటి అనుమానం రాకుండా ఉంటుందనేది ప్లాన్. అది కూడా ఒడిశాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి అప్పగించేస్తున్నాడని అన్నారు చింతపల్లి ఏఎస్‌పి ప్రతాప్ శివ కిషోర్. ఇక నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు..వారి నుంచి మొత్తం 20 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 13 బైకులుపై మాత్రమే కేసులు ఉన్నాయి. 20 బైకుల్లో మిగతా ఏడు బైక్‌లు ఎక్కడా చోరీకి గురయ్యాయి అనే దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..