Nandamuri Balakrishna: మీసం మెలేసి తొడ గొట్టారు.. అందుకే, నేను తేల్చుకుందాం రా అంటూ కౌంటర్‌ ఇచ్చా: బాలకృష్ణ

కేసులకు భయపడేదే లేదు, దేనికైనా సిద్ధం.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లో ఎలాంటి అవినీతి జరగలేదు.. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదు, జనం రోడ్లపైకి వచ్చే పరిస్థితి వచ్చింది.. అంటూ బాలకృష్ణ పేర్కొన్నారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై బాలకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. అసెంబ్లీ వాయిదా అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. తల్లి లాంటి నా వృత్తిని అంబటి అవమానించారు..

Nandamuri Balakrishna: మీసం మెలేసి తొడ గొట్టారు.. అందుకే, నేను తేల్చుకుందాం రా అంటూ కౌంటర్‌ ఇచ్చా: బాలకృష్ణ
Balakrishna
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 21, 2023 | 2:16 PM

కేసులకు భయపడేదే లేదు, దేనికైనా సిద్ధం.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లో ఎలాంటి అవినీతి జరగలేదు.. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదు, జనం రోడ్లపైకి వచ్చే పరిస్థితి వచ్చింది.. అంటూ బాలకృష్ణ పేర్కొన్నారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై బాలకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. అసెంబ్లీ వాయిదా అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. తల్లి లాంటి నా వృత్తిని అంబటి అవమానించారు.. అంబటి నన్ను చూసి మీసం మెలేసి తొడ గొట్టారు.. అందుకే, నేను తేల్చుకుందాం రా అంటూ కౌంటర్‌ ఇచ్చా.. నేను ఇలా ముందుకొస్తానని వైసీపీ ఊహించలేదు.. అంటూ బాలకృష్ణ పేర్కొన్నారు. సీఎం జగన్‌ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించారని ఆరోపించారు బాలయ్య.

అసెంబ్లీ లో జరిగిన ఘటన ఎంతో బాధాకరమని.. నియంతృత్వ ధోరణిలో శాసనసభ జరగడం చాలా బాధ కలిగించే విషయమని బాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతుంది.. ఆధారాలు లేకుండా స్కిల్ డేవేలప్మెంట్ కేసు పెట్టారన్నారు. ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసి కక్ష పూరితంగా సీఎం వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.. చంద్రబాబుకు వస్తున్న స్పందన, యువగళం పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి కేసు పెట్టారంటూ విమర్శించారు.

రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదు.. యువతకు ఉపాధి లేదంటూ బాలకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు .. చంద్రబాబును జైల్లో పెట్టడమే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. అంతా సక్రమంగా జరిగిందని గతంలో కోర్టు కూడా చెప్పిందని.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ బాలకృష్ణ పేర్కొన్నారు.

ఇలాంటి సంక్షోభాలు గతంలో చాలా చూసామని.. చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారు.. వ్యవస్థలపై విప్లవం రావాలంటూ బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని.. అమరావతి ఉద్యమంలో జూనియర్ ఆర్టిస్టులు వస్తే.. విశాఖ పెట్టుబడుల సదస్సుకు వచ్చిన వారు ఎవరు? అంటూ బాలకృష్ణ వైసీపీకి కౌంటర్ ఇచ్చారు.

ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

ఆంధ్రప్రదేశ్‌అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 27 వరకు సమావేశాలు జరపాలని సభా వ్యవహారాల కమిటీ భేటీలో నిర్ణయించారు. స్పీకర్‌ అధ్యక్షతన BAC సమావేశం జరిగింది. విపక్షం టీడీపీ ఈ భేటీకి హాజరుకాలేదు. ఈ శని, ఆదివారం సభకు విరామం ఉంటుంది. రేపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..