AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే దంపతులు.. అవసరమైన కోర్టుకు వెళ్తామంటూ.. అసలేం జరిగిదంటే..?

Mekapati Chandrasekhar Reddy-Santhamma: ఎక్కడైనా ప్రజలకు కష్టం వస్తే ప్రజా ప్రతినిధులు, అధికారుల వద్దకు వెళుతుంటారు. తమ ప్రాంతంలో సమస్యలు ఉన్నా.. తమ కుటుంబంలో వివాదాలు ఉన్నా పరిష్కారం కోసం ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్లి తమ సమస్యను చెప్పుకుంటారు. ఆ సమస్య మరీ పెద్దయితే కొందరు ఎమ్మెల్యే వద్దకు వెళ్లి తమ బాధలు చెప్పుకుంటుంటారు. అలాంటి పరిస్థితికి భిన్నంగా ఒక ఎమ్మెల్యే మీడియా ముందు తన బాధను చెప్పుకుంటూ కంటతడి పెట్టుకున్నారు.. ఎమ్మెల్యే దంపతులు ఇద్దరూ మీడియా ముందు కన్నీరు పెట్టడం తీవ్ర సంచలనంగా మారింది. అసలేం జరిగింది..? 

మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే దంపతులు.. అవసరమైన కోర్టుకు వెళ్తామంటూ.. అసలేం జరిగిదంటే..?
MLA Mekapati Chandrasekhar Reddy Santhamma
Ch Murali
| Edited By: శివలీల గోపి తుల్వా|

Updated on: Sep 21, 2023 | 2:45 PM

Share

నెల్లూరు జిల్లా, సెప్టెంబర్ 21: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మేకపాటి కుటుంబానిది ప్రత్యేక స్థానం. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న మేకపాటి సోదరులు అన్యోన్యతకు మారు పేరు. అలాంటిది ఇప్పుడు ఆ సోదరుల మధ్య ఆస్తుల రచ్చ మొదలైంది. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నదమ్ములన్న సంగతి తెలిసిందే. ఒకరు ఢిల్లీ, ఇంకొకరు రాష్ట్ర అసెంబ్లీలో సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న కారణంగా పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆ తర్వాత మేకపాటి మరో సోదరుడు రాజగోపాల్ రెడ్డిని ఇంచార్జిగా నియమించింది అధిష్టానం.

ప్రస్తుతం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రెండో భార్యతో ఉంటున్నారు. అయితే ఉన్నట్టుండి మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్యే మేకపాటి భార్య శాంతమ్మ.. రాజమోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆస్తిలో తన వాటా ఇవ్వలేదంటూ బాంబ్ పేల్చారు.. ఎమ్మెల్యే మేకపాటి, భార్య శాంతమ్మ మీడియా ముందు కంటతడి పెట్టారు.. కుటుంబ వ్యాపారంగా ఉన్న KMC కంపెనీలో అందరం కస్థాపడ్డామని ఎందుకు తమకు ఆస్తి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తనకు ఓ కుమార్తె ఉందని తన భవిష్యత్ కోసం ఆస్తి ఇవ్వాలని మీడియా ముందు ఏడుస్తూ చెప్పుకొచ్చారు. అయితే ఎమ్మెల్యే దంపతుల వ్యాఖ్యలను మేకపాటి కుటుంబం తీవ్రంగా ఖండించింది. అసలు ఆస్తుల పంపకాలు జరగలేదనేది నిజం కాదన్నారు. పదేళ్ల క్రితమే అందరికి సమానంగా ఆస్తులు పంచామని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ఇటీవల శాంతమ్మ ను రెండో భార్యగా ప్రకటించిన తర్వాత చంద్రశేఖర్ రెడ్డికి సోదరుల మధ్య గ్యాప్ పెరిగిందని సమాచారం. పార్టీ నుంచి సస్పెండ్ జరిగాక గ్యాప్ బాగా పెరిగింది. ఇన్ని సంవత్సరాలగా లేని ఆస్తుల పంపకాల ఇష్యూ ఇప్పుడెందుకు వచ్చిందని ఇదంతా టిడిపి వెనకుండి నడుపుతున్న డ్రామా అంటున్నారు కొందరు.. అయితే ఎమ్మెల్యే మేకపాటి శాంతమ్మ మాత్రం అంత తేలిగ్గా వదిలేది లేదని.. కోర్టును ఆశ్రయించాయిన సరే తమ ఆస్తిని దక్కించుకుంటామని అంటున్నారు. తాను మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డిని వివాహం చేసుకుని ఇప్పటికి ముప్పై సంవత్సరాలు పూర్తి అయ్యిందని, అయితే అప్పటి నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని గడిచిన ముప్పై ఏళ్లుగా తాను నాలుగు గోడల మధ్య నలిగి పోయానని అన్నారు. ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఆస్తుల్లో తమకు ఎందుకు వాటా ఇవ్వరని ప్రశ్నించారు. తనకు తన బిడ్డకు మేకపాటి రాజ మోహన్ రెడ్డి తగిన న్యాయం చేయక పోతే ఎంతటి పోరాటం చేసేందుకు సైతం తాను సిద్ధం అంటూ ప్రకటించడంతో మేకపాటి కుటుంబం మరోసారి వార్తలో నిలిచింది. దీంతో మేకపాటి కుటుంభంలో బయటపడ్డ ఆస్తుల పంపకాల ఇష్యు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.