Vande Bharat: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందేభారత్ రైళ్లు.. ఎక్కడ నుంచి ఎక్కడవరకంటే.?
తెలుగు రాష్ట్రాలకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఒకటి కాదు ఏకంగా రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు పట్టాలెక్కనున్నాయి. ఇక బెంగళూరుకు వెళ్లే ప్రయాణీకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను మరో మూడు రోజుల్లో..
తెలుగు రాష్ట్రాలకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఒకటి కాదు ఏకంగా రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు పట్టాలెక్కనున్నాయి. ఇక బెంగళూరుకు వెళ్లే ప్రయాణీకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను మరో మూడు రోజుల్లో పరుగులు పెట్టనుంది. హైదరాబాద్, బెంగళూరు మధ్య పరుగులు పెట్టే ఈ రైలును ప్రధాని మోదీ సెప్టెంబరు 24న వర్చువల్‌గా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఆ రోజున కాచిగూడ నుంచి ఉదయం 5.30 గంటలకు ట్రైన్ బయల్దేరనుండగా.. మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకోనుంది. ఇక మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 25 నుంచి ఈ రైలు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. సోమవారం ఉదయం ఐదున్నర గంటలకు ఈ రైలు బయలుదేరి.. మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా మధ్యాహ్నం రెండు గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది. తిరిగి 2 గంటల 45 నిమిషాలకు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటల 45 నిమిషాలకు కాచిగూడ చేరుకుంటుంది.
ఈ రైలుతో పాటు సెప్టెంబర్ 24న ప్రధాని మోదీ మొత్తం 9 వందేభారత్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటిల్లో విజయవాడ-చెన్నై వందేభారత్ కూడా ఉంది. ఈ రైలు విజయవాడ నుంచి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై చేరుకుంటుంది. గురువారం మినహా అన్ని రోజులు ఈ ట్రైన్ ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ఇక ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రోజూ ఉదయం ఐదున్నర గంటలకు విజయవాడలో బయలుదేరి, మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు చెన్నై చేరుకుంటుదని వివరించారు. తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకి ప్రారంభమై రాత్రి 10 గంటలకు విజయవాడకు చేరుతుందని రైల్వే అధికారులు చెప్పారు.
కాగా, ఇప్పటికే ఏపీ, తెలంగాణ మధ్య నడుస్తోన్న రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ఎక్కువగా ప్రజాదరణ ఉంది. సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే ఈ రైళ్లల్లో సీట్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. రెండూ రద్దీగా ఉండే రూట్లు కావడంతో ప్రయాణీకులు సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఈ వందేభారత్ రైళ్లనే ఎంచుకోవడం విశేషం.
మరోవైపు ఇటీవల మరికొన్ని టెక్నికల్ మార్పులతో వందేభారత్ రైళ్లు పట్టాలెక్కాయి..
Vande Bharat trains to get technical changes – @THHyderabad @RailMinIndia #VandeBharat pic.twitter.com/HfiXZL7fqU
— South Central Railway (@SCRailwayIndia) September 21, 2023
IR upgrading Vande Bharat trains for enhanced passenger comfort#VandeBharat @RailMinIndia pic.twitter.com/Ee7W0ZKxhe
— South Central Railway (@SCRailwayIndia) September 21, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..