AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇలా ఉన్నారేంట్రా.. కలిసి మందు తాగుతూనే క్షణాల్లో దారుణం చేశారు.. చూస్తే హడలే..

విశాఖ తాటి చెట్ల పాలెం బజార్ బార్లో కిరణ్ అనే యువకుడి హత్య తీవ్ర కలకలం సృష్టించింది. స్నేహితులుగా ఉన్న వారే.. ఒక్కసారిగా విచక్షణ కోల్పోయి హతమార్చారు. ఒకరు తలపై కొడితే మరొకరు స్క్రూ డ్రైవర్ తో మెడపై పొడిచి చంపేశారు.నిందితులను అదుపులోకి తీసుకున్నరు పోలీసులు. పాత కక్షల నేపథ్యంలోని హత్య జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు.

Andhra Pradesh: ఇలా ఉన్నారేంట్రా.. కలిసి మందు తాగుతూనే క్షణాల్లో దారుణం చేశారు.. చూస్తే హడలే..
Crime
Maqdood Husain Khaja
| Edited By: Shiva Prajapati|

Updated on: Jul 28, 2023 | 8:48 PM

Share

విశాఖ తాటి చెట్ల పాలెం బజార్ బార్లో కిరణ్ అనే యువకుడి హత్య తీవ్ర కలకలం సృష్టించింది. స్నేహితులుగా ఉన్న వారే.. ఒక్కసారిగా విచక్షణ కోల్పోయి హతమార్చారు. ఒకరు తలపై కొడితే మరొకరు స్క్రూ డ్రైవర్ తో మెడపై పొడిచి చంపేశారు.నిందితులను అదుపులోకి తీసుకున్నరు పోలీసులు. పాత కక్షల నేపథ్యంలోని హత్య జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు.

కైలాసపురానికి చెందిన యువకుడు కిరణ్ పెయింటింగ్ పనులు చేసుకుంటాడు. తాటిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన శ్రీను కూడా పెయింటర్ కావడంతో కిరణ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ స్నేహితులుగా మారారు. ఆ తర్వాత క్రమంలో ఇద్దరు మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత మళ్లీ కలుసుకున్నారు. ఈ క్రమంలో శ్రీను, అతని స్నేహితుడు శివ, అలాగే రౌతు సురేష్, కిరణ్ కలిసి తాటి చెట్ల పాలెం లోని వైజాగ్ బార్ అండ్ రెస్టారెంట్ కి వెళ్లారు. మద్యం సేవిస్తూ మాట్లాడుకుంటున్నారు. ఇంతలో వారి మధ్య వివాదం మొదలైంది. కిరణ్ పై దాడి చేస్తూ మిగతా ముగ్గురు బార్ వెనుక వైపు తీసుకెళ్లారు. ఆ తర్వాత హత్య చేశారు. ఇద్దరు తలపై కొడితే మరొకడు స్క్రూ డ్రైవర్తో మెడ పై పొడిచేసాడు.

చనిపోయాడని తెలుసుకొని అక్కడి నుంచి పారిపోయారు. 108 సిబ్బంది వచ్చి చూసేసరికి కిరణ్ ప్రాణాలు కోల్పోయి ఉన్నట్టు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన ఫోర్త్ టౌన్ పోలీసులు.. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. సీసీ కెమెరాలను పరిశీలించి ఆధారాలను సేకరించారు. కిరణ్ హత్యతో ఆ కుటుంబం బోరున విలపించింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు బంధువులకు అప్పగించారు. నిందితులను ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఒకే రోజు రెండు హత్యలు..!

విశాఖ తాటిచెట్లపాలెం బార్ లో కిరణ్ హత్య జరిగిన గంటల వ్యవధిలోనే.. కంచరపాలెం పిఎస్ లిమిట్స్ లోని కప్పరాడ లో మరో హత్య జరిగింది. చిరంజీవి అనే ఆటో డ్రైవర్ను హత్య చేశాడు ఉదయ్. రాయితో తలపై మోది చంపేసాడు. కప్పరాడ బాపూజీ నగర్ వద్ద ఘటన జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న రు కంచరపాలెం పోలీసులు. మత్తుకు బానిస అవుతున్న ఉదయ్ ను అదే ప్రాంతానికి చెందిన చిరంజీవి గతంలో మందలించాడు. ఇదే చిరంజీవి చేసిన పాపమని బోరున విలపిస్తున్నారు మృతుడి బంధువులు. నిందితుడు వెనుక మరికొంతమంది ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఒకే రోజు రెండు ఘటనలతో విశాఖ ఉలికి పడింది. పోలీసుల పరుగులు పెట్టారు. రెండు కేసులను నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..