- Telugu News Photo Gallery Spiritual photos Sripuram Golden Temple Creates Another Record, Know All Details Here in Pictures
Sripuram Golden Temple: అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న శ్రీపురం గోల్డెన్ టెంపుల్.. అలాంటివారు ఒక్కసారి దర్శించుకుంటే చాలట..!
Velluru Golden Temple: వెల్లూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్ మరో అరుదైన రికార్డ్‌ని సొంతం చేసుకుంది. తిరుపతి, కాణిపాకం దర్శనాలకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా విజిట్ చేస్తున్న ఆలయాల్లో ఒకటిగా గోల్డెన్ టెంపుల్ నిలిచింది.
Updated on: Jul 28, 2023 | 3:53 PM

వెల్లూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్ మరో అరుదైన రికార్డ్‌ని సొంతం చేసుకుంది. తిరుపతి, కాణిపాకం దర్శనాలకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా విజిట్ చేస్తున్న ఆలయాల్లో ఒకటిగా గోల్డెన్ టెంపుల్ నిలిచింది.

ఈ ఆలయంలో బంగారు లక్ష్మీదేవి విగ్రహంతో పాటు, ప్రపంచంలోనే అతిపెద్ద 1,700 కిలోల వెండి శ్రీ శక్తి గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 2021 జనవరి 25వ తేదీన ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

తాజాగా ఇప్పుడు ఈ శక్తి గణపతి విగ్రహానికి అలంకరించిన కిరీటం అంతకంటే విశిష్టమైనదిగా నిలుస్తోంది. ఈ కిరీటంలో పొదిగిన అరుదైన వైఢూర్యం ప్రపంచంలోనే అతి పెద్ద వైఢూర్యంగా రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఈ వజ్రం దాదాపు 880 క్యారెట్ల బరువు ఉంది. ఇప్పటివరకూ ప్రపంచ రికార్డ్స్‌లో నిలిచిన అతిపెద్ద వైఢూర్యం బరువు 700 క్యారెట్లు మాత్రమే.

సహజంగా నవరత్నాలకు ప్రత్యేక శక్తులు కలిగి ఉంటాయి. తొమ్మిది గ్రహాలలోని శక్తులు అక్కడ ప్రసరింపజేస్తాయి అని భక్తుల నమ్మకం. ఆ విధంగా, నవరత్నాలలో ఒకటైన వైడూర్యం కేతు భగవాన్ శక్తిని ప్రసరింపజేస్తుందని కిరీటం ఏర్పాటు సందర్భంగా శ్రీ శక్తి అమ్మ స్పష్టం చేశారు.

ఎవరైతే ఎంతో విలువైన వైఢూర్యాలను కొనుగోలు చేసి ధరించలేని భక్తులు ఈ గణపతిని దర్శించుకుని ఆశీర్వాదం పొందవచ్చని శ్రీ శక్తి అమ్మ చెప్పారు. కాగా, తిరుపతి, కాణిపాకం దర్శనాలకు వెళ్లే భక్తులు చాలా వరకు ఈ ఆలయాన్ని తప్పక సందర్శిస్తుంటారు.





























