- Telugu News Photo Gallery Spiritual photos Sravana Masam 2023: Six Vastu Tips For The Month Of Shravan
Astro Tips on Shravanam: శ్రావణమాసంలో ఈ వాస్తు చిట్కాలను పాటించి చూడండి.. అదృష్టం మీ సొంతం..
శివపురాణం ప్రకారం అమృతం కోసం సముద్ర మధనం శ్రావణ మాసంలో జరిగింది. ఈ సమయంలో పుట్టిన విషాన్ని సేవించిన శివుడు ప్రపంచాన్ని రక్షించాడు. అదే విధంగా ఎవరైనా శాపం లేదా జీవితంలోని కష్టాల నుంచి రక్షించబడాలంటే శివుడిని ఆరాధించడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు కష్టాల నుండి భక్తులను విముక్తి చేస్తాడు శివయ్య. ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలో శివుడిని ఏ విధంగా పూజిస్తే తగిన ఫలితాలు పొందవచ్చునో ఈ రోజు తెలుసుకుందాం..
Updated on: Jul 28, 2023 | 7:24 AM


అదృష్టం కోసం మినీ వాటర్ ఫౌంటెన్ వంటి చిన్న నీటి చిహ్నాలను ఇంటి తూర్పు మూలను ఏర్పాటు చేసుకోండి. అయితే ఆ నీటి ఫౌంటెన్ నుండి నీటి ప్రవాహం ఉత్తరం నుండి తూర్పుకు ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు నీటిని కనీసం వారానికి రెండు సార్లు శుభ్రం చేయాలి. తూర్పున ప్రవహించే మంచినీరు వ్యక్తి ఆలోచన ప్రక్రియలో చాలా అదృష్టాన్ని తెస్తుంది. తద్వారా ఎవరైనా సరే తమ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి.. నిర్దేశించుకున్న లక్ష్యాలను వేగంగా సాధించడానికి ప్రోయాక్టివ్‌గా మారడానికి వీలు కల్పిస్తుంది.


శివుని మరొక ముఖ్యమైన అంశం రుద్రాక్ష. ఇది శివుని కన్నీటితో సృషించబడిన రుద్రాక్షను శ్రావణ మాసంలో ధరించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఎవరిపై గ్రహాల దుష్ప్రభావాలు ఉంటాయో ..వాటి నుంచి రక్షణ కవచంగా పనిచేయడమే కాదు.. అపారమైన శాంతి, సామరస్యం పెంపొందించడంలో సహాయపడుతుంది. కుటుంబం, ఉద్యోగ సంబంధాలను సమతుల్యం చేయడానికి 'దో ముఖి' రుద్రాక్షను, వివాహ అవకాశాలను మెరుగుపరచడానికి గౌరీ శంకర రుద్రాక్షను ధరించవచ్చు. పంచ ముఖి రుద్రాక్ష విస్తృతంగా అందుబాటులో ఉంది. ఈ రుద్రాక్షలను రోజువారీ ప్రార్ధన కోసం ఉపయోగిస్తారు.

శ్రావణ మాసంలో చెడు కర్మలు, ఋణాల నుంచి విముక్తి కోసం ఉపవాసం , పూజా క్రతువులని నిర్వహిస్తారు. చల్లని పాలు, నీరు, బిల్వ పత్రాలను సమర్పిస్తారు. భోళాశంకరుడు అనుగ్రహం కోసం జీవితంలో శాంతి, శ్రేయస్సు కోసం ప్రతి సోమవారాల్లో శివలింగంపై పెరుగు, తేనెతో అభిషేకం చేయండి..

ఉమ్మెత్త పుష్పం శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనదిగా భావించబడుతుంది. వివిధ దేవాలయాల్లో శివుడి పూజ కోసం ఈ పువ్వును అలంకరించేందుకు ఉపయోగిస్తారు. భయాందోళనలను అధిగమించడానికి శివుడికి ఈ పువ్వుతో చేయడం అత్యంత ఫలప్రదం. సమస్యాత్మకమైన మనస్సు, భావోద్వేగాలను శాంతపరచడానికి ఉద్దేశించబడింది.

Lord Shiva




