AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Price: రూ. 100 లీటర్ పెట్రోల్.. మన తెలుగు రాష్ట్రంలోనే.. వివరాలివే..

పెట్రోల్ ధరలు అంతకంతకు పెరిగిపోతుండంతో తిరుపతిలో ఒక రియల్టర్ కొత్త ఆలోచనకు తెరలేపాడు. ఎన్నికల సమయంలో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తన పుట్టినరోజుకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తిరుపతిలో రెండు పెట్రోల్ పంపుల్లో రూ.100 కే లీటర్ పెట్రోల్ ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. పుట్టిన రోజు సందర్భంగా ఈ ఆఫర్ ను..

Petrol Price: రూ. 100 లీటర్ పెట్రోల్.. మన తెలుగు రాష్ట్రంలోనే.. వివరాలివే..
Petrol Price
Raju M P R
| Edited By: Shiva Prajapati|

Updated on: Jul 28, 2023 | 8:37 PM

Share

పెట్రోల్ ధరలు అంతకంతకు పెరిగిపోతుండంతో తిరుపతిలో ఒక రియల్టర్ కొత్త ఆలోచనకు తెరలేపాడు. ఎన్నికల సమయంలో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తన పుట్టినరోజుకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తిరుపతిలో రెండు పెట్రోల్ పంపుల్లో రూ.100 కే లీటర్ పెట్రోల్ ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. పుట్టిన రోజు సందర్భంగా ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఉదయం 9 రాత్రి 8 గంటల వరకు బైక్ లైనా, కార్లైనా కేవలం పెట్రోల్ మాత్రమే అది కూడా 5 లీటర్లు వరకు మాత్రమే లీటర్ వంద రూపాయలు చొప్పున అమ్మకాలు సాగించారు.

తిరుపతి కి చెందిన రియల్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి తన బర్త్ డే రోజు ఈ సబ్సిడీ తో పెట్రోల్ విక్రయం జరిపించారు. రెండు బంకుల వద్ద పెద్ద ఎత్తున గుమిగూడిన వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. తిరుచానూరు రోడ్డులోని ఒక పంపు, చంద్రగిరి రోడ్ లోని మరో పంపులో కేవలం రూ. 100 కే లీటర్ పెట్రోల్ పొందేలా రూ. 500 లకు 5 లీటర్ల పెట్రోల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ఎన్నికల సమయంలో రియల్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి కొత్త ఆలోచనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..