TDP: ఉత్తరాంధ్రలో మోగిన గంట.. అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి..

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ ప్రతిపక్ష టిడిపిలో అసమ్మతి రాజుకుంది. తనను అధిష్టానం చీపురుపల్లి నుండి పోటీ చేయమని చెప్తుంది అన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలతో ప్రస్తుత చీపురుపల్లి టిడిపి ఇంచార్జి, జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. నాగార్జున అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గ క్యాడర్ అయోమయంలో పడింది. అసలు చీపురుపల్లిలో క్యాండిట్‎ను ఎందుకు మార్చాల్సి వచ్చింది? టిడిపి ఎందుకు ఆ నిర్ణయానికి వచ్చింది? క్యాండిట్‎ను మారిస్తే ఇంచార్జి కిమిడి నాగార్జున పరిస్థితి ఏంటి?

TDP: ఉత్తరాంధ్రలో మోగిన గంట.. అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి..
Ganta Srinivas Vs Kimidi Na
Follow us
G Koteswara Rao

| Edited By: Srikar T

Updated on: Feb 23, 2024 | 8:19 PM

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ ప్రతిపక్ష టిడిపిలో అసమ్మతి రాజుకుంది. తనను అధిష్టానం చీపురుపల్లి నుండి పోటీ చేయమని చెప్తుంది అన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలతో ప్రస్తుత చీపురుపల్లి టిడిపి ఇంచార్జి, జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. నాగార్జున అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గ క్యాడర్ అయోమయంలో పడింది. అసలు చీపురుపల్లిలో క్యాండిట్‎ను ఎందుకు మార్చాల్సి వచ్చింది? టిడిపి ఎందుకు ఆ నిర్ణయానికి వచ్చింది? క్యాండిట్‎ను మారిస్తే ఇంచార్జి కిమిడి నాగార్జున పరిస్థితి ఏంటి? ఆయనకు అధిష్ఠానం ఏమి హామీ ఇస్తుంది? అసలు గంటా చెప్పింది నిజమేనా? అనే అనేక అనుమానాలు జిల్లాలో చర్చకు దారితీశాయి.. దీంతో ఉత్తరాంధ్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రతి నియోజకవర్గం గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో ఆయా రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర కీలక నేత, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి బొత్స పోటీ చేస్తున్న చీపురుపల్లిపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది ప్రతిపక్ష టిడిపి.

ఎలాగైనా జరగబోయే ఎన్నికల్లో బొత్సని కట్టడి చేయాలి, బొత్స ను నియోజకవర్గానికే పరిమితం చేయాలి, అందుకోసం బొత్సపై బలమైన నేతను బరిలో దించి అన్నిరకాలుగా రాజకీయ ప్రయోజనాలు పొందాలి అనే ప్రణాళికతో అడుగులు వేస్తుంది. అందుకోసం బొత్స పోటీ చేయబోతున్న చీపురుపల్లిలో టిడిపి నుండి ఉత్తరాంధ్రలో ఓటమి తెలియని మరో కీలకనేత గంటా శ్రీనివాసరావుని బరిలో దించేందుకు సిద్ధమైంది. ఆ విషయాన్ని నేరుగా గంటానే మీడియాతో చెప్పటంతో ఒక్కసారిగా విజయనగరం జిల్లాలో కలకలం రేగింది. చీపురుపల్లిలో బొత్సపై గంటా పోటీ చేయబోతున్నారు అనే వార్తలతో చీపురుపల్లి టిడిపి క్యాడర్ అంతా అయోమయంలో పడింది. తనను చీపురుపల్లి నుండి పోటీ చేయమని అధిష్టానం చెప్పింది అని గంటా మీడియాతో చెప్పిన వార్త వినగానే ప్రస్తుత టిడిపి ఇంచార్జి కిమిడి నాగార్జున అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఫోన్స్‎కి కూడా అందుబాటులోకి రాలేదు. పార్టీ పెద్దలు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు. నాగార్జున ప్రస్తుతం చీపురుపల్లి ఇంచార్జిగానే కాకుండా జిల్లా టిడిపి అధ్యక్షుడుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో గంటా వ్యాఖ్యలపై నాగార్జున మనస్థాపానికి గురైనట్లు సమాచారం.

చీపురుపల్లి సీటుపై అధిష్టానం ఏమైనా నిర్ణయం తీసుకుంటే అధిష్టానం ప్రకటించాలి కానీ అలా కాకుండా తాను ఇంచార్జిగా ఉన్న చీపురుపల్లిలో గంటా తనకు తాను ప్రకటించుకోవడం ఏంటి? గంటా ఎవరు? నా నియోజకవర్గంలో గంటా తనకు తానుగా అధిష్టానం చెప్పినట్లు మీడియాతో చెప్పి క్యాడర్‎ను కన్ఫ్యుజ్ చేయడం ఏంటి? అని తన అనుచరుల వద్ద ఒకింత ఆవేదనకు గురయ్యాడట. కిమిడి నాగార్జున తూర్పు కాపు సామాజికవర్గం నేత. తండ్రి గణపతిరావు మాజీ ఎమ్మెల్యే, తల్లి మృణాళిని జిల్లా పరిషత్ చైర్ పర్సన్‎గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019 లో పోటీచేసి బొత్స చేతిలో ఓటమి పాలైన నాగార్జున అప్పటి నుండి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ వచ్చారు. నాగార్జున చీపురుపల్లి ఇన్చార్జిగానే కాకుండా జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఇంతటి నేపథ్యం ఉన్న కిమిడి నాగార్జున అజ్ఞాతంలోకి వెళ్ళడంతో సర్వత్రా ఉత్కంఠగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో గంటా ఎంట్రీతో మనస్తాపం చెందిన కిమిడి నాగార్జున పార్టీకి దూరం అవుతారా? లేక పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తారా? అసలు గంటా వస్తారా? లేక హైకమండ్ వ్యూహం మరేమైనా ఉందా? అనే అనేక ప్రశ్నలు కూడా అందరినీ తొలుస్తున్నాయి. ఏదిఏమైనా గంటా విజయనగరం జిల్లా పాలిటిక్స్ కొత్త చర్చకు తెరలేపాయి అనే చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..