AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Xi Jinping: ముచ్చటగా మూడోసారి మొదలుకానున్న జిన్‌పింగ్ రాజ్యం.. అంతా గమనిస్తున్న ప్రపంచ దేశాలు..

వరుసగా మూడో టర్మ్‌.. థర్డ్‌ టైమ్‌ చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనేందుకు సిద్ధమైన జిన్‌పింగ్‌..ఆయన ఎన్నిక ఇవాళ లాంఛనంగా జరగనుంది.

Xi Jinping: ముచ్చటగా మూడోసారి మొదలుకానున్న జిన్‌పింగ్ రాజ్యం.. అంతా గమనిస్తున్న ప్రపంచ దేశాలు..
Xi Jinping
Shaik Madar Saheb
|

Updated on: Oct 23, 2022 | 8:27 AM

Share

ముచ్చటగా మూడోసారి చైనా అధినేతగా జిన్‌పింగ్‌.. ఇవాళ లాంఛనంగా ఎన్నిక జరగనుంది. వారం రోజుల పాటు జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్‌ సమావేశాలు శనివారంతో పూర్తయ్యాయి. ఈ సమావేశాల్లో 200 మంది సీనియర్‌ పార్టీ నేతలతో కొత్త సెంట్రల్‌ కమిటీని ఎంపిక చేశారు. ఈ కమిటీ ఇవాళ సమావేశమై, కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుంటుంది. పార్టీ జనరల్‌ సెక్రటరీగా జిన్‌పింగ్‌ పేరును ప్రకటించనున్నారు. దీంతో జిన్‌పింగ్‌ మూడో దఫా అధినేతగా కొనసాగడం లాంఛనమే అవుతుంది. అలాగే 25 మందితో కూడిన పోలిట్ బ్యూరోను, అత్యంత శక్తివంతమైన ఏడుగురు సభ్యులతో కూడిన పోలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటిని ప్రకటించనున్నారు.

ఇదిలా ఉంటే, చైనా అధ్యక్ష పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టడానికి అనుమతినిచ్చే నిబంధనలను జీ జిన్‌పింగ్ 2018లో రద్దు చేశారు. దీంతో మూడోసారి ఆ పదవిని చేపట్టడానికి ఆయనకు మార్గం సుగమమైంది. ఇక ప్రతీ ఐదేళ్లకు ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కాంగ్రెస్ సమావేశాలు జరుగుతుంటాయి. పార్టీలో కీలక పదవులకు ఎన్నికలు జరగడంతో పాటు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

CPC సమావేశాల ముగింపు సందర్భంగా ప్రసంగించిన జిన్ పింగ్‌.. ధైర్యంగా పోరాటం చేయాలని, తలలు వంచి కష్టపడాలని, నమ్మకంతో ముందుకు సాగాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఐతే కమ్యూనిస్టు పార్టీ వేడుకల్లో అధ్యక్షుడు జిన్‌ పింగ్‌కు ఎడమ వైపు కూర్చున్న హు జింటావోనూ బయటకు తీసుకెళ్లడం చర్చనీయాంశం అయింది.

ఇవి కూడా చదవండి

కాగా.. జిన్ పింగ్ మూడోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అమెరికా సహా ప్రపంచదేశాలన్నీ నిశితంగా గమనిస్తున్నాయి.