Diwali in US: దీపావళి వేడుకలను జరుపుకున్న యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్.. భారతీయ వంటకాలతో ప్రత్యేక విందు

కమలా హారిస్‌తో పాటు, ప్రజలు కూడా ఒకరికొకరు దీపావళి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. వేడుకల సందర్భంగా ఆమె తన నివాసాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు. అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతోపాటు భారతీయ వంటకాలతో విందునిచ్చారు.

Diwali in US: దీపావళి వేడుకలను జరుపుకున్న యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్.. భారతీయ వంటకాలతో ప్రత్యేక విందు
kamala harris diwali celebration
Follow us
Surya Kala

|

Updated on: Oct 23, 2022 | 7:52 AM

దేశ, విదేశాల్లో ఉన్న భారతీయులు దీపావళి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. తన అధికారిక నివాసం నేవల్ అబ్జర్వేటరీలో దీపావళి వేడుకలు నిర్వహించారు. నీరా టాండన్, వివేక్ మూర్తి, రిచ్ వర్మ, అజయ్ భూటోరియాతో సహా పలువురు ప్రముఖ భారతీయ-అమెరికన్లు ఈ వేడుకకు హాజరయ్యారు. కమలా హారిస్ దీపావళి వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

కమలా హారిస్ తన భర్తతో కలసి సంతోషంగా దీపావళి వేడుకలను జరుపుకోవడం వీడియో లో చూడవచ్చు. కమలా హారిస్‌తో పాటు, ప్రజలు కూడా ఒకరికొకరు దీపావళి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. వేడుకల సందర్భంగా ఆమె తన నివాసాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు. అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతోపాటు భారతీయ వంటకాలతో విందునిచ్చారు.

ఇవి కూడా చదవండి

దీపావళి వేడుకలు:

చీకటి,కాంతిని సమతుల్యం చేసే పండుగ భారతీయ-అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మాట్లాడుతూ దీపావళి పండుగ అనేది సంస్కృతులకు అతీతమైన సార్వత్రిక భావన అన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా  ఆమె మాట్లాడుతూ ఈ పండగ సంస్కృతికి సంబంధించినది. దీపావళి విశిష్టతను వివరిస్తూ.. సంస్కృతులు, వర్గాలకు అతీతంగా అనాదిగా వస్తున్న భావన. చీకటికి, వెలుతురుకు మధ్య సమతుల్యతను పాటిస్తూ జీవితాన్ని గడపాలని దీపావళి నేర్పుతుందని అన్నారు.

కొన్ని శక్తివంతమైన శక్తులు మనల్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నాయి దీపావళి అంటే వెలుగులు నింపే పండుగ అని కమలా హారిస్ అన్నారు. చీకట్లోంచి వెలుగులోకి ప్రయాణం చేయడానికి మన పాత్ర ఏమిటో ఈ దీపావళి నేర్పుతుందని అన్నారు. ఏదో ఒక శక్తివంతమైన శక్తి మనల్ని విభజించడానికి ప్రయత్నిస్తోందని కొన్నేళ్లుగా మనం గ్రహించామని అన్నారు. కొన్ని సమస్యల పై దృష్టి పెట్టినప్పుడు.. అసమానతలు ఉన్నాయని తెలిసిందని.. వాటిని ఉమ్మడిగా ఎదుర్కోవాలని సూచించారు.

మరిన్ని గ్లోబల్ భారత్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.