Horoscope Today: ఈరోజు ఈ రాశివారు పట్టిందల్లా బంగారమేనట.. ధన్ తేరాస్ రోజున ఏ రాశి ఫలం ఎలా ఉన్నదంటే..

రోజు మొదలైతే మనిషి ముందుగా ఆలోచించేది.. ఈరోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు.  వెంటనే తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 23వ తేదీ ) ఆదివారం  రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు పట్టిందల్లా బంగారమేనట.. ధన్ తేరాస్ రోజున ఏ రాశి ఫలం ఎలా ఉన్నదంటే..
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Oct 23, 2022 | 6:26 AM

Horoscope Today (23-10-2022):  జీవితంలో జరిగే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని.. అందుకు అనుగుణంగా తాము నడుచుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందుకనే రోజు మొదలైతే మనిషి ముందుగా ఆలోచించేది.. ఈరోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు.  వెంటనే తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 23వ తేదీ ) ఆదివారం  రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ  రోజు ఈ రాశివారు శుభకార్యాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బులు అందుతాయి. శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఇతరులతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు కొన్ని పనులను బాధ్యతగా పుర్తి చేయాల్సి ఉంది. మానసిక ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అనుకోని పరిస్థితులు నిరుత్సాహాన్ని కలిగిస్తాయి.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు. మానసిక ధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్త్రాలను కొనుగోలు చేస్తారు.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు భవిష్యత్ కు ఉపయోగపడే నిర్ణయాలతో ముందుకు వెళ్లారు. అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు శుభకార్యాల్లో పాల్గొంటారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాల్సి ఉంటుంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రయాణాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక బలం తగ్గకుండా సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు ఇతరుల సహకారంతో ముందుకు వెళ్లారు. అలసట ఎక్కువగా ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహాన్ని అందుకుంటారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో కలిసి సంతోషముగా గడుపుతారు. మేలైన నిర్ణయాలతో శుభఫలితాలను పొందుతారు. ప్రారంభించిన పనులను ఎన్ని ఆటంకాలు ఎదురైనా పూర్తిచేస్తారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. వృత్తి, విద్య, ఉద్యోగాల్లో ఆర్థికాభివృద్ధిని అందుకుంటారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండాలి. బాధాకరమైన వార్తను వింటారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ప్రారంభించిన పనులల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. అనవసర విషయాలకు దూరంగా ఉండడం మేలు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు కలహాలకు దూరంగా ఉండాలి. ఇతరుల సహకారంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఏడుకాకుండా ముందుచూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)