Solar Eclipse: తులారాశిలో ఏర్పడనున్న సూర్యగ్రహణం.. ఈ నక్షత్రంపై తీవ్ర ప్రభావం.. మరి కొన్ని రాశులవారికి డబ్బే డబ్బు..
ఆశ్వయుజ మాసం బహుళ పక్ష అమావాస్య స్వాతి నక్షత్రంలో ఈ నెల 25 వ తేదీ మంగళవారం సాయంత్రం సూర్యగ్రహణం ఏర్పడనుంది. సాయంత్రం 4.46 ని.లకు పాక్షిక గ్రహణం ప్రారంభమైం 6.26 ని.లకు పూర్తి కానుంది
27 ఏళ్ల తర్వాత దీపావళి రోజున అంటే 25వ తేదీ మంగళవారం భారతదేశంలో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం.. సూర్యుడు తులారాశిలో స్వాతి నక్షత్రంలో ఉన్న సమయంలో గ్రహణంలో ఏర్పడనుంది. కనుక తులారాశివారు సూర్యగ్రహణాన్ని చూడరాదు. స్వాతి నక్షత్రంలో జన్మించినవారిపై ఈ కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణ ప్రభావం ఉండనుందని పంచాంగ కర్తలు పేర్కొన్నారు. తులారాశిలో సూర్యుడు, శుక్రుడు, కేతువు, చంద్రుడు కూడా ఉంటారు. వీటి ప్రభావంతో పలు రాశులపై సూర్యగ్రహణ ప్రభావం పడనుంది. ముఖ్యంగా కొన్ని రాశులవారికి మంచి ప్రయోజనాలు కలిగిస్తే.. మరొకొందరికి మిశ్రమ ఫలితాలను అందిస్తుందని.. ఇంకొన్ని రాశులవారికి అశుభఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు.
గ్రహణ కాలం:
ఆశ్వయుజ మాసం బహుళ పక్ష అమావాస్య స్వాతి నక్షత్రంలో ఈ నెల 25 వ తేదీ మంగళవారం సాయంత్రం సూర్యగ్రహణం ఏర్పడనుంది. సాయంత్రం 4.46 ని.లకు పాక్షిక గ్రహణం ప్రారంభమైం 6.26 ని.లకు పూర్తి కానుంది. గ్రహణ మధ్య కాలము సాయంత్రం గం. 5.29 నిముషాలు. గ్రహణ పుణ్యకాలము 1.25 నిముషాలు. ఈ నేపథ్యంలో పలు రాశులపై తీవ్ర ప్రభావం చూపించనుంది.
ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం ఈ నాలుగు రాశులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. అదృష్టాన్ని తీసుకొస్తుందని అంటున్నారు. ఏ రాశుల వారికి మంచి జరుగుతుందో, వారిని ఎలాంటి అదృష్టం వరిస్తుందో తెలుసుకుందాం..
కేతస్థ పాక్షిక సూర్యగ్రహణం సింహరాశి, వృషభ రాశి, మకర రాశి, ధనుస్సు రాశుల వారికి శుభఫలితాలని ఇస్తుంది. ఆర్ధికంగా లాభాలను తెస్తుంది.
ఈ రాశివారికి మధ్యమ ఫలితాలు:
కన్యరాశి, మేష రాశి, కుంభ రాశి , మిథున రాశులకు మధ్యస్త ఫలితాలను ఇవ్వనుంది.
ఈ రాశులవారికి అశుభఫలితాలను ఇచ్చే పాక్షిక గ్రహణం
సూర్యగ్రహణం ఏర్పడే తులారాశి వారితో సహా కర్కాటకరాశి , మీన రాశి, వృశ్చిక రాశుల వారికి అశుభ ఫలితాలు కలుగజేస్తుందని పంచాంగ కర్తలు చెబుతున్నారు.
గ్రహణ నియమాలు:
గ్రహణం సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాత ఏర్పడనుంది కనుక.. మూడు గంటల లోపు ఆహారాన్ని తినాల్సి ఉంటుంది. అంతేకాదు సూర్యగ్రహణము సమయంలో పట్టు, విడుపు తలస్నానము ఆచరించడం శుభఫలితాలను ఇస్తుంది. పట్టు స్నానం చేసే వీలు లేకపోతె కనీసం విడుపు స్నానం చేయడం శుభప్రదం. సూర్యారాధన, ఆదిత్య హృదయం పఠనం మేలు చేస్తుంది. రాహు జపం, దుర్గాదేవి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ గ్రహణ సమయంలో చేసే దానానికి విశేష ఫలితం ఉంటుందని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)